ప్రేయసికి ప్రియుడి క్షమాపణ..ఐయాం సారీ అంటూ హోర్డింగ్..

 ప్రేయసికి ప్రియుడి క్షమాపణ..ఐయాం సారీ అంటూ హోర్డింగ్..

ఇద్దరు ప్రేమికుల మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు ఏర్పడటం కామన్.  ఒక చిన్న మాటతోనో, అనుకోని పరిస్థితితోనో  ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు. అయితే పట్టుదలకు పోయి ఆ గ్యాప్ను  అలాగే వదిలేస్తే.. విలువైన అనుబంధం కాస్తా చేజారిపోతుంది. తప్పు మనవైపు ఉంది అని మన విచక్షణ చెబుతున్నప్పుడు.. మనం చెప్పే ఒక చిన్న క్షమాపణతో బంధాలు తిరిగి బలపడతాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఓ ప్రియుడు తన ప్రేయసికి వినూత్నంగా క్షమాపణ కోరాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అయింది. 

సుష్, సంజూలు ఇద్దరు ప్రేమికులు. వీరికి ఏదో విషయంలో గొడవ జరిగింది. దీంతో సుష్ అనే ప్రియుడు తన ప్రేయసికి వినూత్నంగా క్షమాపణ చెప్పాడు. నోయిడాలో ఏకంగా హోర్డింగ్ ఏర్పాటు చేశాడు. ఈ హోర్డింగ్లో ఐయామ్ సారీ సంజు, ఐ విల్ నెవర్ హర్ట్ యు ఎగేయిన్..యువర్ సుష్ అని రాసి ఉంది. ఈ హోర్డింగ్ ను ఓ ట్వి్ట్టర్ యూజర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. 

హోర్డింగ్ ఏర్పాటు చేసి తన ప్రేయసి సంజూకు సుష్ క్షమాపణ చెప్పడం కొత్తగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. హోర్డింగ్ తో సుష్ తన ప్రేయసి మనసును గెలిచుకున్నాడో లేదో కానీ..మా మనసులు మాత్రం గెలుచుకున్నాడని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.