నోయిడాలో దేశంలోనే తొలి ఏఐ క్లినిక్ ఓపెన్.. జిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించిన ఏడీజీహెచ్ఎస్

నోయిడాలో దేశంలోనే తొలి ఏఐ క్లినిక్ ఓపెన్.. జిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించిన  ఏడీజీహెచ్ఎస్

 లక్నో: దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులను హైటెక్‌‌గా మార్చే దిశగా శనివారం ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. యూపీలోని నోయిడాలో ఉన్న గవర్నమెంట్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్ )లో దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్‌‌ను భారత  హెల్త్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీహెచ్ఎస్) ఆన్‌‌లైన్‌‌ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో ఏఐఐఎంఎస్ గువాహటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అశోక్ పురాణిక్, డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ జాయింట్ సెక్రటరీ అమన్ శర్మతో పాటు దేశవ్యాప్తంగా 200 మందికి పైగా డాక్టర్లు, ఏఐ స్టార్టప్‌‌లు, ఆరోగ్య నిపుణులు, పాలసీ మేకర్లు, ఇన్నోవేటర్లు వర్చువల్ గా హాజరయ్యారు. ఏఐ క్లినిక్ స్థాపనకు జీఐఎంఎస్‌‌కు చెందిన సెంటర్ ఫర్ మెడికల్ ఇన్నోవేషన్ (సీఎంఐ) ప్రధాన పాత్ర పోషించింది.