చదువుకున్నోళ్లే కదా : కారు కోసం పెళ్లాన్ని చంపటం ఏంటీ.. మైండ్ ఉందా..

చదువుకున్నోళ్లే కదా : కారు కోసం పెళ్లాన్ని చంపటం ఏంటీ.. మైండ్ ఉందా..

గ్రేటర్ నోయిడా.. బాగా చదువుకున్న ఫ్యామిలీ.. 2022లో వికాస్, కరిష్మా పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆ సమయంలో కట్నకానుకల కింద పావు కేజీ బంగారం, ఓ SUV కారు ఇచ్చారు. ఏడాది బాగానే సాగింది వీరి కాపురం.. ఓ పాప పుట్టింది. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి.

ఆడ పిల్ల పుట్టిన తర్వాత వికాస్ ఫ్యామిలీ నుంచి కరిష్మాకు వేధింపులు మొదలయ్యాయి. డబ్బు కోసం చిత్రహింసలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కరిష్మా ఫ్యామిలీ పెద్దల పంచాయితీ పెట్టింది. 10 లక్షల రూపాయలు ఇవ్వటానికి అంగీకరించి.. ఆ మొత్తాన్ని కరిష్మా కుటుంబం చెల్లించింది. అయినా వేధింపులు ఆగలేదు. మరో 20 లక్షల రూపాయలు, ఫార్చూన్ కారు కావాలని డిమాండ్ చేసింది వికాస్ ఫ్యామిలీ. భర్త తల్లిదండ్రులు కూడా వేధిస్తుండటంతో.. పలుసార్లు కరిష్మా మానసిక వేదనకు గురైంది. 

ఇదే సమయంలో 2024, ఏప్రిల్ ఒకటో తేదీ తన భర్త, అత్తమారులు తనను కొడుతున్నట్లు సోదరుడు దీపక్ కు ఫోన్ చేసి చెప్పింది కరిష్మా. ఫోన్ లో ఏడుస్తూ చెప్పటం.. తీవ్ర బాధలో ఉండటాన్ని గమనించి దీపక్.. వెంటనే సోదరి కరిష్మా ఇంటికి వచ్చాడు. అప్పటికే కరిష్మా చనిపోయింది. దీనిపై పోలీసులకు కంప్లయింట్ చేశారు. 

కేవలం ఫార్చూన్ కారు ఇవ్వలేదనే కారణంగానే తన సోదరిని కొట్టి చంపారంటూ దీపక్ కేసు ఫైల్ చేశాడు. ఫార్చూన్ కారు అంటే 40 లక్షల రూపాయలు అవుతుందని.. అంత డబ్బు లేదని పదేపదే చెబుతూ వచ్చామని.. అయినా వేధింపులు ఆగలేదని చెబుతున్నాడు దీపక్. పెళ్లి సమయంలో SUV కారు ఇచ్చామని.. రెండేళ్లకు ఫార్చూన్ కారు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు. తన సోదరిని బావ వికాస్ ఫ్యామిలీనే కొట్టి చంపిందని.. కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తున్నాడు దీపక్.