వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్ నెట్టింట వైరల్.. ఆ పెళ్లికి వెళ్లాలంటే..15వందలు చెల్లించాల్సిందే..

వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్ నెట్టింట వైరల్.. ఆ పెళ్లికి వెళ్లాలంటే..15వందలు చెల్లించాల్సిందే..

పెళ్లి అంటే వధువరులు, కుటుంబ సభ్యులు, బంధువులకోలాహలం.. పెళ్లి బాజాలు, సాంప్రదాయ బద్దంగా పెళ్లి తంతు, రుచికరమైన భోజనాలు, ఆ తర్వాత గ్రాండ్ గా బరాత్ లు ఉంటాయి మనందరికి తెలుసు.కానీ వధువరులు లేకుండా, బంధువులు లేకుండా పెళ్లి ఎప్పుడైనా చూశారా.. పోనీ విన్నారా.. నోయిడాలో ఇలాంటి పెళ్లికి ఆహ్వానం పలికారు కొందరు.  వారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ.. ఈ విచిత్రమైన వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.   

  
నోయిడాలో ఇటీవల ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన వివాహ ఆహ్వానం(ఫేక్ వెడ్డింగ్ ఇన్విటేషన్)  వైరల్ అవుతోంది. ఇందులో దుల్హా (వరుడు) ,బంధువులు (రిష్టేదార్) ఉండరని, కేవలం ధోల్స్, నృత్యం, విందు మాత్రమే ఉంటాయని ఈ ఆహ్వాన పత్రికలో రాసి ఉంది. ఈ ఆహ్వానం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. సాధారణంగా పెళ్ళి అంటే వధూవరులు, బంధుమిత్రులు, ఆచారాలు ఉంటాయి. కానీ ఈ ఆహ్వానంలో ఆ సంప్రదాయాలన్నింటినీ పక్కన పెట్టి, కేవలం వేడుకలో ఆనందించే అంశాలైన సంగీతం, నృత్యం, భోజనంపై మాత్రమే దృష్టి పెట్టారు. ఇదే ఈ ఆహ్వానం వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం. ఇది కేవలం సరదా కోసం ఏర్పాటు చేసిన ఓ సామాజిక వేడుకలా అనిపిస్తుంది.

ఆహ్వానంలో ఏముంది?

ఆరయాన్ష్ అనే యూజర్  ఫేక్ వెడ్డింగ్ అనే పేరుతో ఉన్న ఈ ఆహ్వానాన్ని X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. ఆ ఆహ్వానంలో లైవ్ బ్యాండ్ ,ధోల్, లైవ్ ఫుడ్ కౌంటర్, డెకరేషన్, ఎథ్నిక్ వేర్ ,సెల్ఫీ బూత్ గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి వేదిక నోయిడాలోని గార్డెన్స్ గల్లెరియా మాల్‌లో ఉన్న ట్రిప్పీ టెకీలా అని రాశారు. 

ఈ బారాత్ జూలై 12 శనివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది.. సాంప్రదాయ దుస్తులు ధరించి ఉచిత షాదీ వాలీ LIIT పొందండి అని కూడా ఆహ్వాన పత్రంలో రాశారు. ఈ కార్యక్రమానికి టిక్కెట్ల ధర రూ. 999 నునంచి రూ. 1499 మధ్య ఉంటుందని మెన్షన్ చేశారు. మహిళా కవర్ ఛార్జ్ రూ. 999, స్టాగ్ కవర్ ఛార్జ్ ,జంట కవర్ ఛార్జ్ రూ. 1499. అందులో రాశారు. 

ఈ పోస్ట్ లో ఇప్పుడు మీరు రూ. 1499 చెల్లించి ఫేక్ వెడ్డింగ్ కు హాజరు కావచ్చు. వధువరులు వద్దు, బంధువులు వద్దు, మీరు రండి, వైబ్ తీసుకొని ఇంటికి వెళ్లండి. ఇది రుచికరమైన భోజనం, ధోల్, డ్యాన్స్ ,ఇన్‌స్టాగ్రామ్ విలువైన ఫొటోలను కవర్ చేస్తుంది. వైల్డ్ కాన్సెప్ట్!" అని ఫేక్ వెడ్డింగ్ ఫొటోతో ట్యాగ్ చేశారు.  

►ALSO READ | ఆర్సీబీ, కేఎస్‎సీఏదే బాధ్యత: బెంగుళూర్ తొక్కిసలాటపై ప్రభుత్వానికి జ్యుడిషియల్ కమిషన్ నివేదిక

ధోల్స్, డ్యాన్స్, విందు: ఈ వేడుక ప్రధాన ఆకర్షణలు సంప్రదాయ డప్పులు, డ్యాన్సులు,పెద్ద విందు. భారతీయ వివాహాలలో ప్రజలు ఎక్కువగా ఆనందించే అంశాలు ఇవే కావడం విశేషం.ఈ 'నకిలీ పెళ్లి' వెనుక ఉన్న నిర్వాహకులు లేదా వారి ఖచ్చితమైన ఉద్దేశ్యం గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఇది ఓ ప్రచార కార్యక్రమం కావచ్చని, ఓ సామాజిక ప్రయోగం కావచ్చని, లేదా స్నేహితులు కలిసి ఒక పెద్ద, సరదా పార్టీని నిర్వహించడానికి చేసిన ప్రయత్నం కావచ్చని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 

ఈ వినూత్న ఆహ్వానం.. ఇప్పుడున్న సాంప్రదాయాలకు భిన్నంగా చుట్టాలులేని వారికి చుట్టాలతో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అందించే సోషల్ మీట్ నిర్వహించడం లాంటిది. వినోదం, డ్యాన్సులు, రుచికరమైన భోజనం ఉంటే చాలు వేడుకను ఘనంగా నిర్వహించవచ్చని ఈ ఫేక్ వెడ్డింగ్ చెప్పకనే చెబుతోంది.