పాత పాల్వంచలో బోనాల సందడి

పాత పాల్వంచలో బోనాల సందడి

పాల్వంచ, వెలుగు : పట్టణంలోని పాత పాల్వంచ గడియ కట్ట మైస మ్మ తల్లి ఆలయంలో ఆదివారం బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలను తీసుకొని మహిళలు ఊరేగింపుగా మైసమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, విమల దంపతులు హాజరయ్యారు.

 మేళ తాళాలు, భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగిస్తూ తీసుకురావడంతో గ్రామంలో సందడి నెలకొంది. పలువురు నృత్యాలు చేయగా అమ్మవారి ప్రతిమ కలిగిన పల్లకిని యువకులు ఉత్సాహంగా మోశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండం వెంకన్నతో పాటు స్థానికులు పాల్గొన్నారు.