శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బండ ప్రకాష్ నామినేషన్

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బండ ప్రకాష్ నామినేషన్

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బండ ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలే ఆయన పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో శాసనసభ ఆవరణలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీ కాలం 2021, జూన్ 3న ముగిసింది. అయితే మెజారిటీ బీఆర్ఎస్‌వైపే ఉన్నప్పటకీ అప్పట్నుంచి డిప్యూటీ ఛైర్మన్ పదవిని సీఎం భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ కు బీఆర్ఎస్ తరపున బండ ప్రకాష్ ఇయ్యాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికకు వేరెవరూ నామినేషన్లు దాఖలు వేయకపోతే బండ ప్రకాషే ఎకగ్రీవంగా నియామకం కానున్నారు. లేదంటే ఈ నెల 12న మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక ప్రక్రియ జరగనుంది.