‘ధరణి’లో వ్యవసాయేతర ఆస్తులను ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు

‘ధరణి’లో వ్యవసాయేతర ఆస్తులను ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌‌‌‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఎప్పుడైనా నమోదు చేసుకునే వీలుందని, గడువంటూ ఏమీ లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇది నిరంతరం కొనసాగుతుందని పేర్కొంది. ధరణి పోర్టల్‌‌‌‌ను చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని హైదరాబాద్‌‌‌‌కు చెందిన అడ్వకేట్​ గోపాల్‌‌‌‌ శర్మ దాఖలు చేసిన పిల్​పై బుధవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ముందు వాదనలు కొనసాగాయి. పిటిషనర్​ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్​ దేశాయ్‌‌‌‌ ప్రకాష్‌‌‌‌రెడ్డి వాదించారు. ధరణి పోర్టల్​పై ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు మాత్రమే చేసిందని, ఎలాంటి చట్టం చేయలేదని తప్పుబట్టారు. ఆఖరికి కులం వివరాలు కూడా కోరుతున్నదని చెప్పారు. హైకోర్టు కల్పించుకొని.. కులం గురించి చెబితే తప్పేమిటని, బడిలో చేరడం దగ్గర్నుంచి అన్ని చోట్లా కులం గురించి అడుగుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ కల్పించుకుని.. ధరణి పోర్టల్‌‌‌‌లో నమోదు చేసుకునే వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయని, ప్రభుత్వం గోప్యత పాటిస్తుందన్నారు. ధరణిలో వివరాలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసేందుకు గడువు ఉన్నట్లుగా పత్రికల్లో వార్తలు వచ్చినందున ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రకాశ్ రెడ్డి కోరారు. ఆస్తుల నమోదుకు 15 రోజులే గడువు ఇచ్చామనే  వాదన వాస్తవం కాదని ఏజీ బీఎస్​ ప్రసాద్ పేర్కొన్నారు. గడువు ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు . వాదనలు విన్న హైకోర్టు విచారణను నవంబర్‌‌‌‌ 3కు వాయిదా వేసింది.

For More News..

డబ్బు పంచకుండా గెలవగలవా? సీఎం కేసీఆర్‌కు వివేక్ సవాల్

నాయిని నర్సింహరెడ్డి కన్నుమూత