దంపతుల భూ దందాపై కేసు నమోదు

దంపతుల భూ దందాపై కేసు నమోదు

ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించిన భార్యాభర్తలపై దుండిగల్​ పోలీసులు నాన్​బెయిలబుల్ ​కేసులు నమోదు చేశారు. కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 342 లోని రెండు ఎకరాలకుపైగా ఉన్న ప్రభుత్వ భూమిని రాజు అనే వ్యక్తి భార్యతో కలిసి ప్లాట్లుగా చేసి అమ్ముకున్నాడు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ గౌతమ్ విచారణలో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నట్లు తేలడంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. తహసీల్దార్​ఆదేశాల మేరకు రాజు, అతని భార్య సుధపై దుండిగల్ పోలీసులకు పోలీసులు నాన్​బెయిల్ కేసులు నమోదు చేశారు.