
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మూడు రోజుల పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ . భారీ వర్షాలపై 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి మంత్రులు, అధికారులకు సూచించిన సీఎం.. రానున్న మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు సీఎం.హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
►ALSO READ | తుప్పుపట్టిన ఫ్రిడ్జ్ లు, కత్తులు, బొద్దింకలు, ఈగలు..హైదరాబాద్లో రెస్టారెంట్లు ఇంత దారుణంగా ఉన్నాయా
అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలని సూచించారు సీఎం. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. విద్యుత్ కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. స్కూల్స్, కాలేజీలు, ఐటీ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్.