సహనం కోల్పోయిన ఎంపీ జయాబచ్చన్..సెల్ఫీ విషయంలో ఓ వ్యక్తిపై ఆగ్రహం

సహనం కోల్పోయిన ఎంపీ జయాబచ్చన్..సెల్ఫీ విషయంలో ఓ వ్యక్తిపై ఆగ్రహం

సీనియర్ నటి, రాజకీయ నేత, సమాజ్ వాది పార్టీ ఎంపీ జయబచన్ సహనం కోల్పోయారు. సెల్ఫీ విషయంలో ఓ వ్యక్తిని తిట్టారు. దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన అతడిని ఏం చేస్తున్నారు మీరు అంటూ దూరంగా నెట్టివేశారు. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన జయబచన్ తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని నెట్టివేసి తిడుతున్న వీడియో వైరల్ అవుతోంది. నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది.   

ఈ సంఘటన కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మంగళవారం(ఆగస్టు 12) జరిగింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో బచ్చన్ క్లబ్ వైపు నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకోవడానికి ఓ వ్యక్తి ఆమె దగ్గరగా వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే జయా బచ్చన్ అతన్ని దూరంగా నెట్టివేసి క్యా కర్ రహే హై ఆప్  అంటూ కోపంగా ప్రశ్నించినట్లు అక్కుడున్న వారంతా ఆమె చర్యలతో షాక్ అయినట్లు కనిపిస్తోంది.

అభిమానులు లేదా మీడియా అనుమతి లేకుండా ఆమెను ఫోటో తీయడానికి ప్రయత్నించడం పట్ల బచ్చన్ తీవ్రంగా స్పందించడం ఇదే మొదటిసారి కాదు. ఫొటోగ్రాఫర్లు, ప్రజలతో ఆమె వ్యవహరించిన తీరు గతంలో కూడా చర్చకు దారి తీశాయి. 

►ALSO READ | వెహికల్ ఓనర్స్కు గుడ్న్యూస్..పాతడీజిల్,పెట్రోల్ వాహనాలపై చర్యల్లేవ్

ఈ వీడియో ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు జయాబచ్చన్ ప్రవర్తనను విమర్శించారు. ఇది సరియైంది కాదు, అహంకారం అని ఘాటుగా స్పందించారు. ప్రజాసేవలో ఉన్న వ్యక్తిగా,  పార్లమెంటు సభ్యురాలిగా ఆమె ప్రవర్తనను ప్రశ్నిస్తూ చాలామంది నెటిజన్లు పోస్టులు షేర్ చేశారు. 

అయితే కొంతమంది ఆమెను సమర్థించారు. ఆ వ్యక్తి ఆమె అనుమతి లేకుండా ఆమె సెల్ఫీలు తీయడం సరికాదని వాదించారు. సెలబ్రిటీలను గౌరవించాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.