
హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్-ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు భారీ ఫ్లైఓవర్ ( ఎలివేటేడ్ కారిడార్) నిర్మించనున్నారు. హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ప్యారడైజ్ నుంచి బోయినపల్లి డెయిరీ ఫామ్ వరకు నిర్మించే మొదటి కారిడార్‌లో భాగంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు నెలల్లోపు పరీక్షలు పూర్తి చేసి వాటి ఆధారంగా పిల్లర్లను నిర్మించనున్నారు. ఈ పనులతో పాటే భూసేకరణ కూడా కొనసాగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు డిఫెన్స్‌కు చెందిన 113.48 ఎకరాల భూములు అవసరం కాగా.. ఇటీవలే డిఫెన్స్‌తో భూబదలాయింపు విషయంలో అంగీకారం కుదిరింది.
ఇదే మొదటి కారిడార్
హైదరాబాద్ లో నేషనల్ హైవే 44పై రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ఇబ్బందులు తప్పించడానికి ఈ కారిడార్‌ను ప్యారడైజ్‌నుంచి తాడ్ బండ్ మీదుగా బోయిన్పల్లి డెయిరీఫామ్వరకూ 5.4 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో బేగంపేట ఎయిర్పోర్ట్రావడంతో బాలంరాయ్ వద్ద 600 మీటర్ల అండర్ గ్రౌండ్ టన్నెల్నిర్మించనున్నారు. దీనికోసం ఎయిర్పోర్ట్అథారిటీ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1550 కోట్లు ఖర్చు చేయనున్నారు.
త్వరలోనే రెండో కారిడార్‌లో కూడా..
రెండో కారిడార్అయిన జేబీఎస్నుంచి శామీర్‌పేట వద్ద ఔటర్ ను కలుపుతూ నిర్మించే పనులు కూడా త్వరలో చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 18 కి.మీ. మేర నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్ ను పరిహారంతో కలిపి పూర్తి చేయడానికి దాదాపు 2వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్‌సెంటర్ వద్ద 500 మీటర్ల అండర్ గ్రౌండ్ టన్నెల్ కట్టనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా శామీర్‌పేట నుంచి సిద్దిపేట, కరీంనగర్, గజ్వేల్తదితర ప్రాంతాలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్లిపోవచ్చు. డిఫెన్స్ భూములు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్వరలోనే ఈరూట్లో కూడా భూసార పరీక్షలు నిర్వహించి పనులను ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.
గోడలు, రిజర్వాయర్ల నిర్మాణం..
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్పరిధిలో దాదాపు 10 కి.మీ మేర ప్రహారీగోడను నిర్మించనున్నారు. భవిష్యత్‌లో కారిడార్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ గోడను సరిహద్దుగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కొన్ని చోట్ల ఇప్పుడున్న రిజర్వాయర్లు కూల్చాల్సి వస్తుండడంతో అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో రెండు భారీ రిజర్వాయర్లను హెచ్ఎండీఏ నిర్మించి కంటోన్మెంట్
బోర్డుకు ఇవ్వనున్నది.