KINGDOM OTT: నెలరోజుల్లోపే ఓటీటీలోకి ‘కింగ్‌డమ్‌’.. మొత్తం బాక్సాఫీస్ వసూళ్లు ఎంతంటే?

KINGDOM OTT: నెలరోజుల్లోపే ఓటీటీలోకి ‘కింగ్‌డమ్‌’.. మొత్తం బాక్సాఫీస్ వసూళ్లు ఎంతంటే?

‘కింగ్‌డమ్‌’మూవీ బాక్సాఫీస్.. ఇక ముగిసినట్టే అని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయాయి. జూలై 31,2025న విడుదలైన కింగ్‌డమ్, ఇప్పటివరకూ ఇండియాలో రూ.50.94కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.90కోట్లకి పైగా గ్రాస్ సాధించినట్లు నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

అయితే, సోషల్ మీడియాలో మాత్రం కింగ్‌డమ్ వందకోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ, మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. చివరగా మేకర్స్.. 4 రోజుల్లో రూ.82 కోట్ల గ్రాస్ సాధించినట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు.  

ఇదిలా ఉంటే.. రూ.130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ, నిర్మాతలు అంచనా వేసిన ఖర్చులో 40% మాత్రమే తిరిగి పొందగలిగనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే, ఇంకా కొన్ని థియేటర్లలో రన్ అవుతోంది. కానీ, 12వ రోజైన సోమవారం (ఆగస్టు 12న) కేవలం 26లక్షల నెట్ మాత్రమే వసూళ్లు చేసినట్లు ట్రేడ్ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే కింగ్‌డమ్ మూవీ బాక్సాఫీస్ క్లోజ్ అయినట్టే అనే ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

అయితే, విజయ్ దేవరకొండ కెరీర్ లోనే  కింగ్‌డమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. కానీ, వసూళ్లు రాబట్టడంలో మాత్రం చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయింది.

కింగ్‌డమ్ ఓటీటీ:

కింగ్‌డమ్ మూవీ లాంగ్ థియేటర్ రన్ దాదాపు ముగుసిసినట్టే. ఇంకో రెండ్రోజుల్లో థియేటర్స్ లోకి వార్ 2, కూలీ మూవీస్ రానున్నాయి. ఈ క్రమంలో కింగ్‌డమ్ మూవీ ఓటీటీ రాకపై నెటిజన్లు ఓ లుక్కేస్తున్నారు.

ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.53 కోట్లకు కొనుగోలు చేసింది. దీని వలన నిర్మాతలు పెట్టిన బడ్జెట్‌లో సగం తిరిగి పొందారు.

ఇకపోతే, ఈ మూవీ ఆగస్టు 28 లేదా 29 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. అతి త్వరలో మేకర్స్ మరియు నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కథేంటంటే:

సూర్య అలియాస్ సూరి (విజయ్ దేవరకొండ) ఓ పోలీస్ కానిస్టేబుల్. చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన తన అన్న శివ (సత్యదేవ్‌) కోసం వెతుకుతుంటాడు. తన తెగువ, తెలివితేటలు చూసిన అధికారులు.. అతడిని ఓ స్పెషల్‌ ఆపరేషన్‌పై అండర్‌‌ కవర్‌‌ స్పై ఏజెంట్‌గా శ్రీలంకలోని జాఫ్నాకు పంపిస్తామంటారు.

అతను స్పైగా వెళ్లబోయే గ్యాంగ్‌కు లీడర్‌‌ శివ.. సూరి వెతుకుతున్న తన అన్నయ్య ఒకరే. అన్నను వెనక్కి తీసుకొచ్చేందుకు స్పై ఏజెంట్‌గా శ్రీలంక వెళ్లిన సూరి.. అతని స్థానంలో మాఫియా కింగ్‌ ఎందుకు అయ్యాడు? శ్రీకాకుళం నుంచి వెళ్లిన తెలుగు వాళ్లు శ్రీలంకలో ఎందుకు ఉన్నారు? మురుగన్‌ (వెంకిటేష్‌ వీపీ)తో సూరి ఎందుకు తలపడ్డాడు? ఇందులో డా.అను (భాగ్యశ్రీ బోర్సే) పాత్రేమిటి అనేది మిగతా కథ.