Coolie Movie: రజనీకాంత్ 'కూలీ' మేనియా.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ధర. 4, 500కి పెంపు!

Coolie Movie: రజనీకాంత్ 'కూలీ' మేనియా..  ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ధర. 4, 500కి పెంపు!

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఆయన సినిమా అంటే అభిమానులకు పండుగే. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగావిడుదల కానున్న 'కూలీ' మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. అడ్వాన్స్ బుకింగ్ తోనే కాకుండా.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు ఎంతో అత్రుతగా ఉన్నాయి.  'కూలీ' మూవీ మేనియా ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కనిపిస్తోంది. 

ఈ సినిమా  టిక్కెట్  ఏకంగా రూ. 4,500 వరకు అమ్ముడవుతున్నాయంటే రజనీకాంత్ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  తన అభిమాన నటుడి మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే ఈ అధిక ధర అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలోని ఒక థియేటర్ లో 'కూలీ' మూవీ టిక్కెట్ ను ఒక్కొక్కటి రూ. 4,500 వరకు అమ్ముతున్నట్లు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..  మరికొన్ని థియేటర్లు బ్లాక్ లో రూ. 400కి అమ్ముతున్నన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను అవకాశంగా తీసుకుని థియేటర్లు అధిక ధరలకు టిక్కెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నాయి.

ప్రస్తుతం ఆన్ లైన్ లో టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో బ్లాక్ లో కూలీ మూవీ టిక్కెట్లు కొనడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు అభిమానులు. చెన్నైలోని అన్ని థియేటర్లలో టిక్కెట్లు బ్లాక్ లో అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాయని రజనీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం టిక్కెట్ల ధరలు రూ. 600, రూ. 1000, రూ. 4500 వరకు బ్లాక్ లో అమ్ముతున్నారని తెలిపారు.

 

తెల్లవారుజామున థియేటర్లతో సినిమా ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి  నిరాకరించింది. 2023లో 'తునివు' vs 'వరిసు'  మూవీ ప్రదర్శన సందర్భంగా తోపులాటలో ఒక అభిమాని మరణించారు. అప్పటి నుంచి అర్థరాత్రి, ఉదయం 4, 5 గంటల సమయంలో థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడం లేదు.  కనుక తమిళనాడులో  మూవీలో షోలు ఉదయం 9 గంటలకు మాత్రమే ప్రారంభమవుతాయి.

►ALSO READ | మరోసారి పోలీసు విచారణకు రాంగోపాల్ వర్మ.. ఇప్పడు ఏ కేసులో అంటే..

దాంతో అభిమానులు పొరుగు రాష్ట్రాలకు ప్రయాణిస్తున్నారు.  తమ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న నగరాలకు వెళ్లి ఫస్ట్ షో చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కర్ణాటక, కేరళలలో ఉదయం 6 గంటల నుంచే షోలు ప్రారంభమయ్యాయి, ముంబైలో 5 గంటల షోలు కూడా ఉన్నాయి. మరో వైపు  ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో  టిక్కెట్ల ధరలు పెంచడానికి, ప్రీమియర్ షోలు వేయడానికి ప్రభుత్వ అనుమతి కోసం మూవీ మేకర్స్ ఎదురు చూస్తున్నారు. 

 'కూలీ' సినిమా మొదటి రోజే రూ. 150 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించింది.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రజనీకాంత్ దేవాగా,  సైమన్ గా నాగార్జున, రాజశేఖర్ గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్ గా సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు.  మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే. .