రాబోయే రెండు గంటలు.. ఈ జిల్లాల్లో గట్టిగనే వర్షాలు.. పబ్లిక్ జర జాగ్రత్త !

రాబోయే రెండు గంటలు.. ఈ జిల్లాల్లో గట్టిగనే వర్షాలు.. పబ్లిక్ జర జాగ్రత్త !

హైదరాబాద్: రాబోయే రెండు గంటల పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 41 నుంచి- 61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాల్లో గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో).. తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.