Rajinikanth Coolie: సింగపూర్ లో తలైవా క్రేజ్.. 'కూలీ' సినిమాకు కంపెనీలు టిక్కెట్లు, ఫుడ్ ఫ్రీ.. !

Rajinikanth Coolie: సింగపూర్ లో తలైవా క్రేజ్.. 'కూలీ' సినిమాకు కంపెనీలు టిక్కెట్లు, ఫుడ్ ఫ్రీ.. !

ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్న 'కూలీ' మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ సింగపూర్ లోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.  ఈ సినిమా చూసేందుకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది.
 
సింగపూర్‌లో రజనీ క్రేజ్
సింగపూర్ లోని ఫార్మర్ కన్ స్ట్రక్షన్స్ పీటీఈ లిమిటెడ్  సంస్థ రజనీకాంత్ అభిమానుల మనసు గెలుచుకుంది.  ఆగస్టు 14న 'కూలీ' మూవీ విడుదల సందర్భంగా తమ ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది. అంతే కాదు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు టిక్కెట్లు అందిస్తుంది. అలాగే ఆహారం, పానీయాల కోసం అదనంగా 30 సింగపూర్ డాలర్ల భత్యాన్ని కూడా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇది కేవలం ఒక సినిమా వేడుకగా కాకుండా.. ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించడానికి చేపట్టిన సక్షేమ కార్యక్రమంగా పేర్కొనడం విశేషం.  ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సంస్థ తీసుకున్న నిర్ణయంపై  రజనీకాంత్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

అంతేకాదు సింగపూర్ లో మరో సంస్థ కూడా తలైవా అభిమానుల పట్ల ప్రేమను కురిపించింది.  సినిమా రిలీజ్ రోజు ఉదయం 7 గంటల నుండి ఉ. 11.30 గంటల వరకు తమ వ్యాపార కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఎస్ బి మార్ట్ ప్రకటించింది. ఉదయం 11.30 గంటల తర్వాత తమ వ్యాపార కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయిని తెలిపింది. ఈ అసౌర్యానికి చింతిస్తున్నాము అంటూ.. ఆ సంస్థ డైరెక్టర్ కృష్ణన్ ప్రకాష్ నంబియార్ ఒక నోట్ తెలిపారు.

ఉచితంగా 'కూలీ' టిక్కెట్లు!
సింగపూర్ సంస్థల కంటే ముందే చెన్నైకి చెందిన ఉనో ఆక్వా కేర్ సంస్థ  తమ ఉద్యోగులు 'కూలీ' సినిమా చూసేందుకు ఏకంగా తమ అన్ని బ్రాంచ్ లకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది.  అంతేకాకుండా రజనీకాంత్ సినీ జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కంపెనీ ఈ సెలవును ఒక పండుగలా జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు చాక్లెట్లు, ఉచిత "కూలీ" టికెట్లు పంపిణీ చేయనుంది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలో ఆహారం వితరణ చేయడం వంటి సేవా కార్యక్రమాలను చేపట్టనుంది.  

►ALSO READ | సినిమా ఇండస్ట్రీలో డబ్బుతో కొనలేని ఏకైక వ్యక్తి ఆర్. నారాయణ మూర్తి: డైరెక్టర్ త్రివిక్రమ్

ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకు పైగా ఆగస్టు 14న 'కూలీ ' విడుదల కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, సత్యరాజ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ నటించడంతో సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ' కూలీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ' వార్ ' తో పోటీపడనుంది. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాయో చూడాలి మరి.