
పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ మూవీ ఆగస్టు 22 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్కు స్పెషల్ షో ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇవాళ (ఆగస్టు12న) నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్ తన మనసులో మాట పంచుకున్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఆర్. నారాయణ మూర్తి కెరీర్లో 32 సినిమాల ప్రయాణం. ఇదేమి చిన్న ప్రయాణం కాదు. సినిమా ఆడటం, ఆడకపోవడం పక్కన పెట్టేస్తే.. 'నారాయణ మూర్తి' వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన చేసే యుద్ధంలో రాజు ఆయనే.. సైన్యాధిపతి ఆయనే.. చివరికి సైనికుడి కూడా ఆయనే. ఈ ఓక్కమనిషిలో సినిమా ఆలోచన పుట్టిన దగ్గరి నుంచి, తెరకెక్కించి, చివరికి రిలీజ్ చేసి జనం ముందు తీసుకెళ్లే వరకు.. ప్రయత్నం చేసే ఒకే వ్యక్తి ఆర్. నారాయణ మూర్తి.
సమాజంలో నొక్కబడిన గొంతుల గురించి, మాట్లాడానికి ఒక గొంతు ఉంది.. అతనే ఆర్. నారాయణ మూర్తి. ఆ గొంతు ఎప్పుడు అందరికీ వినపడాలి. ప్రపంచంలో ఏకపక్ష ధోరణి రావడం వల్ల.. రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారవుతారు. అలాంటప్పుడు, విభిన్న శైలి ఉన్న నారాయణ మూర్తి సినిమాలు.. తట్టిలేపే శక్తి కలిగివున్నాయని’’త్రివిక్రమ్ అన్నారు.
యూనివర్సిటీ సినిమా గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘రెండు గంటలున్న ఈ సినిమాలో పేపర్ లీకులు, కాలేజీ రోజుల నుంచి విద్య అనేది ఇంగ్లీష్లో ఉండాలా? తెలుగులో ఉండాలా? నిరోద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూడటం, లంచాలు ఇచ్చిన వారికే ఉద్యోగాలు వస్తుంటే.. మిగతా యువకుల నిరాశ వంటి అంశాలతో సినిమా అద్భుతంగా తెరెకెక్కిందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ఒక సామజిక అంశాన్ని, అనగదొక్కపడుతున్న ప్రతి విషయాన్ని నిబద్దతో, నిజాయితీగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం వల్లే అందరిలో నారాయణ మూర్తి అంటే అతి ఎక్కువ గౌరవం అని త్రివిక్రమ్ తెలిపారు.
►ALSO READ | ParamSundari: ‘పరమ్ సుందరి’ ట్రైలర్ రిలీజ్.. సిద్ధార్థ్, జాన్వీల రొమాంటిక్ ఎంటర్టైనర్
ముఖ్యంగా రాజీపడకుండా బతికే జీవితం మీకు మాత్రమే సొంతం. అది ఎవ్వరి వల్ల కాదు.. చివరికి రాజీపడకుండా బ్రతకడం నా వల్ల కూడా కాదని త్రివిక్రమ్ అన్నారు. అలాగే, గతంలో ఓ సినిమాలో కీలక పాత్రకి నారాయణమూర్తి గారిని తీసుకోవాలని అనుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. ఇక ఎలాంటి క్యారెక్టర్ రోల్స్ చేయడం మూర్తిగారికి ఇష్టం ఉండదని ఎవరో చెప్పినట్లు చెప్పారు త్రివిక్రమ్. అయితే, రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి ఆర్. నారాయణ మూర్తి గారిని అస్సలు కొనలేరని కూడా ఫలానా మనిషి తనతో చెప్పినట్లు త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు.
ఇలాంటి సామజిక అంశాలను సినిమా ద్వారా తీసుకొచ్చినప్పుడు, జనం మీరు చెబితేనే వింటారు. ఎందుకంటే.. మీరు సినిమాని డబ్బుల కోసమో, సక్సెస్ కోసమో తీయరు. కేవలం అణిచివేయడుతున్న ప్రతి అంశం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాత్రమే అని త్రివిక్రమ్ అన్నారు. అందువల్ల యూనివర్సిటీ (పేపర్ లీక్) సినిమా ఆడాలి. ఆగస్టు 22న అందరూ థియేటర్కి వచ్చి చూడాలని’’త్రివిక్రమ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.