ParamSundari: ‘పరమ్ సుందరి’ ట్రైలర్ రిలీజ్.. సిద్ధార్థ్‌, జాన్వీల రొమాంటిక్ ఎంటర్టైనర్

ParamSundari: ‘పరమ్ సుందరి’ ట్రైలర్ రిలీజ్.. సిద్ధార్థ్‌, జాన్వీల రొమాంటిక్ ఎంటర్టైనర్

సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా తెరకెక్కించారు. మడాక్‌ ఫిల్మ్స్‌ బ్యానర్ పై దినేశ్‌ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్టు 29న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

ఇవాళ (ఆగస్ట్12న) పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ సిద్ధార్థ్, జాన్వీల మధ్య ప్రేమ ఎలా మొదలైందో చెబుతూ స్టార్ట్ అయింది. నార్త్ ఇండియాకు చెందిన ‘పరం’ (సిద్ధార్థ్ మల్హోత్రా), దక్షిణాదికి చెందిన ‘సుందరి’ (జాన్వీ కపూర్) మధ్య జరిగే లవ్ సీన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. 

భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు విషయంలో భిన్న ధృవాలైన వీరి పెళ్లికి ఎలాంటి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయనేది వినోదభరితంగా తెరకెక్కించినట్టు ట్రైలర్తో అర్థమవుతోంది. కేరళలోని బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో తీసిన విజువల్స్‌‌‌‌‌‌‌‌, సిద్ధార్థ్, జాన్వీల ఆన్‌‌‌‌‌‌‌‌ స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి. సచిన్ జిగర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'ఫీల్-గుడ్' విజువల్స్‌కు అందాన్ని తీసుకొచ్చాయి.

►ALSO READ | కూలీ, వార్2 టికెట్ రేట్ల పెంపునకు.. పర్మిషన్ లేనట్టేనా..? రీజన్ ఏంటంటే..

ఇప్ప‌టికే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా ఆడియన్స్ నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా వర్షం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'బీగీ శారీ' అనే రొమాంటిక్ సాంగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. మొత్తానికి ఈ సినిమా బాలీవుడ్లో మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఏమవుతుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ఇందులో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.