
Tspsc పేపర్ లీకేజీ కేసులో ఏడుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు. శుక్రవారం( జనవరి5) నిందితులను ఎగ్జామినేషన్ కొరకు హాజరు కావాలని కోర్టు ఆదేశించగా.. నిందితులు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి A17, 18, 23, 25, 27, 28 , A37 నిందితులు కోర్టు హాజరు కాలేదు. దీంతో నిందితులు వేసిన ఆబ్సెంట్ పిటిషన్ ను నిరాకరిస్తూ వారిపై వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.