NBFCల ఎత్తుగడ..పెరుగుతున్న బాండ్ల గిరాకీ

NBFCల ఎత్తుగడ..పెరుగుతున్న బాండ్ల గిరాకీ

బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీలు (ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీ) ఎక్కువవడ్డీ రేటుతో బాండ్ల జారీ ద్వారా ప్రజల నుంచి నిధులు సమీకరించడం పెరుగుతోంది. ఎక్కువ వడ్డీ రేటువస్తోంది కదాని ఆలోచించే పబ్లిక్‌‌‌‌ దాని వెనక ఉన్న రిస్క్‌‌‌‌లు ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకోవడం లేదు.కిందటేడాది అక్టోబర్‌‌‌‌లో ఐఎల్‌ ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ సంక్షోభంతో మొదలైన లిక్విడిటీ కొరత దేశీయ ఫైనాన్షియల్‌మార్కెట్‌ మొత్తానికి చుట్టు కుంది. వివిధ సంస్థల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో ఐఎల్‌ ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ విఫలం కావడంతో మార్కెట్లో సంక్షోభంమొదలైంది. దీంతో ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీలకు నిధుల సమీకరణ కష్టతరంగా మారింది. ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీల వ్యా పారకార్యకలాపాలకు నిధుల లభ్యతే ప్రధానమైనది.దాంతో పబ్లిక్‌‌‌‌కు బాండ్లను జారీ చేయడం ద్వా రానిధుల సమీకరణకు అవి ప్రయత్నిస్తున్నాయి.

ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీలకు అప్పులివ్వడానికి మ్యూచువల్‌ఫండ్స్‌‌‌‌, ఇన్‌ స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఇష్టపడటంలేదు. నిధుల సమీకరణకు గత్యం తరం లేని పరిస్థితిలో ఎక్కువ కూ పన్‌ రేటుతో పబ్లిక్‌‌‌‌కు బాండ్ల జారీనిఎన్‌ బీఎఫ్‌‌‌‌సీలు తలపెడుతున్నాయి. మార్కెట్లో లిక్విడిటీ కొరత తీవ్రంగా ఉండటంతోపాటు, గత ఆరేళ్లలో కంపెనీల రేటింగ్స్‌‌‌‌ బాగా తగ్గిపోయాయి.కొన్ని విదేశీ మార్కెట్లలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఇప్పటికేచేతులు కాల్చుకున్నారు. ముఖ్యంగా సింగపూర్లో 34వేల మంది హైఫ్లక్స్‌‌‌‌ లిమిటెడ్ బాండ్‌ కొనుగోలుదారులు చేదు అనుభవం రుచి చూశారు. వారు అసలు,వడ్డీ మొత్తం పోగొట్టు కున్నట్లే . ఇక ఇండియాలోనూతమ రి టైల్‌ బేస్‌‌‌‌ పెంచుకునేందుకు చాలా కంపెనీలు బాండ్స్‌‌‌‌ ఇష్యూ చేస్తున్నాయని ఏకే కాపిటల్‌ సర్వీసెస్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఆశిష్‌ అగర్వా ల్‌ చెప్పా రు.ఈ విభాగంలో ఉండే రి స్క్‌‌‌‌లు ఉండనే ఉన్నాయని,బాండ్స్‌‌‌‌లో పెట్టుబడి పెట్టేప్పుడు ఇన్వెస్టర్లు ఒకటికి,రెం డుసార్లు ఆలోచిం చుకోవడం మంచిదని ఇక్రాఫైనాన్షియల్‌ సెక్టార్‌‌‌‌ రేటింగ్స్‌‌‌‌ హెడ్‌ కార్తీక్‌‌‌‌ శ్రీనివాసన్‌సలహా ఇచ్చారు. ఎక్కువ వడ్డీ ప్రతిఫలాన్ని ఒక దానినేచూసే ఇన్వెస్టర్లు , ఆ కంపెనీల బాండ్స్‌‌‌‌ ఇష్యూలో ఉండేమిగిలిన రిస్క్‌‌‌‌లను గురించి పెద్దగా తెలుసుకోవడంలేదని అభిప్రాయపడ్డారు.

భారీ పెరుగుదల సెబీ డేటా ప్రకారం, ఏప్రిల్‌ 2018 జనవరి 2019మధ్య కాలంలో ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీల బాండ్స్‌‌‌‌ ఇష్యూలురూ.33,700 కోట్లకు చేరాయి. గత పదేళ్లలో ఇంతపెద్ద మొత్తంలో బాండ్స్‌‌‌‌ ఇష్యూల ద్వా రా ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీలు నిధులు సమీకరిం చలేదు. మార్చి 2019 దాకాచూస్తే ఈ నిధుల సేకరణ మొత్తం మరింత పెరిగేఅవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద కంపెనీలైన ఎల్‌అండ్‌ టీ ఫైనాన్స్‌‌‌‌ హోల్డింగ్స్‌‌‌‌, ఇండియా బుల్స్‌‌‌‌ కన్స్యూమర్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌లు చివరి క్వార్టర్‌‌‌‌లో మార్కెట్‌ నుంచిబాండ్స్‌‌‌‌ ఇష్యూల ద్వా రా నిధులు సమీకరించా యి.ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌‌‌‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ఫైనాన్స్‌‌‌‌ సహా అయిదు ఎన్‌బీఎఫ్‌‌‌‌సీలు ఏప్రిల్‌ నెలలో బాండ్స్‌‌‌‌ ఇష్యూలు చేస్తున్నాయి. ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌‌‌‌ తలపెట్టిన బాండ్స్‌‌‌‌ ఇష్యూలో రూ. 500 కోట్లను వ్యక్తిగత ఇన్వెస్టర్ల కోసమే కేటాయించారు. ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీలలిక్వి డిటీ, ఏ ఏ రంగాలలోని క్లయిం ట్లకు ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీ-లు రుణాలు ఇస్తున్నాయనే అంశాలను రి టైల్‌ ఇన్వెస్టర్లు పూర్తిగా తెలుసుకోవడం లేదని, వీటిపై అవగా-హన అవసరమని బ్రిక్‌‌‌‌వర్క్ రేటింగ్స్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఎనలిటికల్‌ఆఫీసర్‌‌‌‌ రజత్‌ బాల్ చెప్పా రు.