నాన్ డ్యూటీ పెయిడ్​ మద్యం పట్టివేత

నాన్ డ్యూటీ పెయిడ్​ మద్యం పట్టివేత

చేవెళ్ల, వెలుగు: నాన్​డ్యూటీ పెయిడ్ ​మద్యం బాటిళ్లను శంషాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వారి వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం మూర్తుజగూడ లోని గొలమారి ఫామ్​హౌస్​లో, తొల్కట్ట శివారులోని గుల్​మోర్​ఫామ్​హౌస్​లో ఆదివారం నాన్​డ్యూటీ పెయిడ్​మద్యం వినియోగిస్తున్నారని ఎక్సైజ్​పోలీసులు సమాచారం వచ్చింది. వారు వెంటనే అక్కడికి వెళ్లి, దాడులు చేశారు. గొలమారి ఫామ్​హౌస్​లో ఢిల్లీ, గోవా నుంచి తెచ్చిన 79 లిక్కర్ ​బాటిళ్లను సీజ్​చేశారు.

​ వీటి విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు. ఫంక్షన్​చేసిన వ్యక్తితోపాటు మద్యం వినియోగానికి పర్మిషన్​తీసుకోనందుకు నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామన్నారు. గుల్​మోర్​ఫామ్​హౌస్​లో రూ.15 వేల విలువైన నాన్​డ్యూటీ పెయిడ్​లిక్కర్​బాటిళ్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు  శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్​రెడ్డి, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు.