హుజూరాబాద్ లోనే నాన్ లోకల్ లీడర్లు

హుజూరాబాద్ లోనే నాన్ లోకల్ లీడర్లు

హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: ఉప ఎన్నికల ప్రచారం కోసమని హుజూరాబాద్ కు వచ్చిన టీఆర్ఎస్ లీడర్లు.. ఆ నియోజకవర్గాన్ని ఇంకా వీడలేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ కు విరుద్ధంగా గ్రామాల్లో మకాం వేసి, గుట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు నియోజకవర్గంలోని వివిధ మండలాల బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజూరాబాద్ పక్కనే ఉన్న హన్మకొండ, కరీంనగర్ లోని హోటళ్లు, కాలేజీల్లో అడ్డా వేసినట్లు తెలిసింది. ఇక వారి అనుచరులు మాత్రం హుజూరాబాద్ లోని పల్లెల్లోనే ఉన్నట్లు సమాచారం. స్థానిక నేతల ఇళ్లలో కొందరు, సమీపంలోని మామిడి తోటల్లో మరికొందరు తిష్ట వేశారు. వీరు నియోజకవర్గంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ముఖ్య నేతలకు చేరవేస్తున్నారు.

సీడ్ కంపెనీలో మంత్రి అడ్డా...

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి ఒకరు హుజూరాబాద్ ను వీడి, దాని పక్కనే ఉన్న శంకరపట్నం మండలం పరిధిలోని ఓ సీడ్ కంపెనీలో అడ్డా వేశారు. శుక్రవారం ఆయన కొత్తగట్టులో దైవదర్శనం పేరిట నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ముఖ్య నేతలను పిలిపించుకొని మంతనాలు జరిపినట్లు తెలిసింది.

డ్వాక్రా గ్రూపులతో మంత్రుల టెలీ కాన్ఫరెన్స్..

హుజూరాబాద్ లో ప్రచారం ముగిసినప్పటికీ, కొందరు మంత్రులు ఇంకా ప్రచారం నిర్వహిస్తుండడం వివాదాస్పదంగా మారింది. డ్వాక్రా గ్రూపుల రీసోర్స్‌‌‌‌‌‌‌‌ పర్సన్లతో మంత్రులు హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు, కొప్పుల ఈశ్వర్ టెలీ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ లో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వానికి సహకరించాలని, అందరినీ మొబిలైజ్‌‌‌‌‌‌‌‌ చేసి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కు ఓటేయించాలని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, జీతాలు పెంచుతామని హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు హామీ ఇచ్చినట్లు అందులో ఉంది.

గజ్వేల్ ఎంపీపీని అడ్డుకున్న గ్రామస్తులు..

నియోజకవర్గంలో ఇతర జిల్లాలకు చెందిన టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు తిరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వారు సైలెంట్ గా ఇంటింటి ప్రచారం చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎంపీపీ అమరావతి రాగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. నాన్‌‌‌‌‌‌‌‌ లోకల్ లీడర్లు ఇక్కడ ఉండొద్దని రూల్‌‌‌‌‌‌‌‌ ఉన్నా ఎందుకొస్తున్నారని నిలదీశారు. ఎవరి పని వారు చేసుకుంటున్నారని, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని బయటి లీడర్లు వచ్చి ఎందుకు చెడగొడుతున్నారని ప్రశ్నించారు.