శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆగని బాంబు బెదిరింపులు

శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆగని బాంబు బెదిరింపులు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని రోజులుగా దండగులు వరుసగా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా గురువారం ఈ ఎయిర్​పోర్టుకు వస్తున్న సౌదీ అరేబియాకు చెందిన ఎయిర్​బోర్న్ ఫ్లెనాస్ ఎయిర్​లైన్స్ విమానంలో ఐదు ఆర్​డీఎక్స్ బాంబులు పెట్టినట్టు మెయిల్ వచ్చింది.

 దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్​పోర్ట్ భద్రతా సిబ్బంది వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికులను కిందకు దింపేసి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు, అర్జీఐఏ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబులు
 లేనట్లు గుర్తించారు.