North Korea: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

North Korea: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

ప్యాంగాంగ్: మరోసారి ఉత్తర కొరియా (North Korea) బాలిస్టిక్​ మిస్సైల్ ​ప్రమోగించింది. ప్యాంగాంగ్ లోని సునాన్ ప్రాంతంలో దీన్ని ప్రయోగించారని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. కొరియన్ పీఠభూమికి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ అవతల మిస్సైల్ పడి ఉండొచ్చని తెలిపింది. క్షిపణి ప్రయోగాన్ని జపాన్ కూడా ధ్రువీకరించింది. 

రోజుల వ్యవధిలో కొరియా అణు క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి. ఈ నెల 14న కూడా తూర్పు తీర జలాల్లోకి  రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఉత్తర కొరియా పరీక్షించింది. దక్షిణ కొరియా, జపాన్ (South Korea–Japan summit) అధ్యక్షులు సమావేశం కానున్న తరుణంతో ఉత్తర కొరియా ఈ ప్రయోగాలను చేపట్టడం గమనార్హం.