పిల్లలు సినిమా చూస్తే పెద్దలకు జైలు: కిమ్ జోంగ్

పిల్లలు సినిమా చూస్తే పెద్దలకు జైలు: కిమ్ జోంగ్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిరంకుశ పాలనలో ప్రజలు మగ్గిపోతున్నారు. కిమ్ నియమించే చట్టాలు, నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. తాజాగా ఇంకొక కొత్త రూల్ ను ఉత్తర కొరియాలో పాస్ చేశాడు. ఆ దేశ పిల్లలు ఎవరైనా హాలీవుడ్ సినిమాలు, ప్రోగ్రామ్స్ చూస్తూ పట్టుబడితే తల్లిదండ్రులను తీవ్రంగా శిక్షిస్తారు. అంతేకాకుండా వాళ్లను ఆరు నెలల పాటు లేబర్ క్యాంప్లలో ఉంచుతారు. పిల్లలను ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అయితే, గతంలో ఇలా పిల్లలు ఫారిన్ సినిమాలు చూస్తూ పట్టుబడితే తల్లిదండ్రులను మందలించి వదిలేసేవారు. ఈ రూల్ ని ఇప్పుడు మార్చారు. విద్యార్థులపై పాశ్యాత్య దేశాల సంస్కృతి ప్రభావం ఉండకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో అమెరికన్ సినిమాలు చూసిన ఇద్దరు ఉత్తర కొరియా హైస్కూల్ విద్యర్థుల్ని ఆ దేశ ప్రభుత్వం ఉరి తీసింది.