
ఇన్నాళ్లు అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పుకొచ్చిన నార్త్ కొరియా.. ఇప్పుడు ఏకంగా వాటిని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఆ దేశం తయారుచేసిన అణు క్షిపణుల వివరాలను అధికారికంగా ప్రకటించింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణు బాంబులను చూస్తోన్న ఫొటోలను.. నార్త్ కొరియా అఫిషియల్ న్యూస్ పేపర్ లో ప్రచురించింది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలతో సమావేశమైన అధ్యక్షుడు కిమ్.. అణు బాంబు ఉత్పత్తిని పెంచాలని సైంటిస్టులకు పిలుపునిచ్చాడు.
ఇప్పటికే ఉత్తర కొరియా నుంచి ఓ బాలిస్టిక్ మిసైల్ లాంఛ్ అయినట్లు గుర్తించారు దక్షిణ కొరియా అధికారులు. మరి కొన్ని మిసైల్స్ ని లాంఛ్ చేసే ప్రమాదముందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే.. హ్వాసంగ్ యూనిట్ నుంచి ఒకేసారి ఆరు మిసైల్స్‌ను లాంఛ్ చేసినట్టు గుర్తించారు. దాడులు చేసేందుకు వినియోగించే క్షిపణులను టెస్ట్ చేయడంపై సౌత్ కొరియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొరియాలోని వెస్ట్ సీ కోస్ట్ ను టార్గెట్‌గా చేసుకుని దాడులకు చేసే అవకాశముందంటోంది. ఇటీవలే కిమ్ తన రెండో కూతురితో కలిసి సైనిక విభాగంలో ఫైర్ డ్రిల్‌ను పర్యవేక్షించిన విషయం తెలిసిందే.