ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పై.. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పై.. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

హైదరాబాద్: నగరంలో లేట్ నైట్ వరకు నడుపుతున్న  క్లబ్ లపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బుధవారం తెల్లవారుజామున బేగంపేట్ ఎయిర్ పోర్టు సమీపంలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. లేట్ నైట్ వరకు రన్ చేయడమే కాక.. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న విశ్వనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.