పాతబస్తీలో తనిఖీ చేసే ధైర్యం ఎవరికీ లేదు.. ఎందుకంటే ఎంఐఎం ఉందని భయం

పాతబస్తీలో తనిఖీ చేసే ధైర్యం ఎవరికీ లేదు.. ఎందుకంటే ఎంఐఎం ఉందని భయం

దుమారం రేపుతున్న ఎంఐఎం ఎమ్మెల్యే మోజమ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో బహదూర్ పుర ఎమ్మెల్యే మోజమ్ ఖాన్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాతబస్తీలో తనిఖీలు చేసేందుకు ఏ ఒక్క ప్రభుత్వ శాఖ అధికారికీ ధైర్యం లేదని.. ఎందుకంటే ఇక్కడ ప్రజల వెనుక ఎంఐఎం ఉందని వారికి భయం.. ఈ ధీమా మీకు ఇలాగే ఉండాలంటే ఎంఐఎం కు ఓటేయమని ఆయన సూచించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బహదూర్ పురలో జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గ్రేటర్ ఎన్నికల్లో  ఓటు ఎలా వేయాలో  స్టేజీపై నుండే సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు.

పోలింగ్ కేంద్రంలోకి వెళితే బ్యాలెట్ పేపర్ ఇస్తారని.. దానిపై ఎంఐఎం బహదూర్ పుర అభ్యర్థి మహమ్మద్ అబ్దుల్ ముస్తఫ పేరు… ఎంఐఎం గుర్తు గాలిపటం గుర్తు  రెండూ ఉంటాయని.. వాటిపై ఓటు ముద్ర వేసి.. అక్కడ ఉన్న బ్యాలెట్ బాక్సులో వేయాలని సెటైరికల్ గా సూచించారు. జనం చప్పట్లు.. ఈలలతో హుషారొచ్చిందేమో..   బ్యాలెట్ పేపర్ తీసుకుని.. తెరచి చూసి.. ఎంఐఎం గుర్తు ఎక్కడుందో చూసి..  వెతకడం అబ్బో చాలా కష్టం.. న్యూసెన్స్ అని అనుకోవద్దు..  కాస్త ఓపిక తీసుకుని.. మన అభ్యర్థి పేరు.. ఎంఐఎం గాలిపటం గుర్తు రెండు చూసి ఓటేయాలన్నారు.  ఎంఐఎం ఉండడం  పాతబస్తీ జనానికి కొండంత ధీమా.. ధైర్యం.. అని బలంగా ఎలుగెత్తి చాటండి. గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా బాగా పెరగాలి.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి.. మన పక్క వాళ్లతో వేయించాలి. ఎందుకంటే  పాతబస్తీ లోకి  వచ్చే ధైర్యం  ఏ ఒక్క అధికారికి లేదన్న విషయం మీకంతా తెలుసే కదా.. పాతబస్తీకి విజిలెన్స్ వాళ్ళు వస్తారా..?..  కరెంట్ బిల్, నల్లా బిల్ లేదా ఏదైనా చెక్ చేద్దామని ఇతర శాఖల వాళ్లు వస్తారా…? రారు..?  ఎందుకు అంటే ఇక్కడ ఎంఐఎం ఉంది..  ఈ ధీమా మీకు ఇలాగే కొనసాగాలి అనుకుంటే ఎంఐఎం కు ఓటు వేయాలని ఎమ్మెల్యే మోజమ్ ఖాన్ కోరారు. ఈ వ్యాఖ్యలు కాస్త కొంత మంది వీడియో తీసి షేర్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారో.. వేచి చూడాల్సిందే.

for more news

డొంక తిరుగుడు సమాధానం.. కరీంనగర్ జిల్లా కోర్టు ఆగ్రహం

కరోనాపై నిర్లక్ష్యం: హెల్త్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

రుచి వాసన లేకపోతే కరోనా సోకినట్లేనా?