నటుడిగా కాదు.. భారతీయుడిగా.. ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన ఎన్టీఆర్

నటుడిగా కాదు.. భారతీయుడిగా.. ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన ఎన్టీఆర్

మరికొద్ది గంటల్లో జరగబోయే ఆస్కార్ వేడుకల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌‌ కేటగిరిలో నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు కచ్చితంగా ఆస్కార్‌‌‌‌ వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అమెరికా చేరుకుంది. తారకరత్న మరణంతో కాస్త ఆలస్యంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్.. గ్లోబల్ మీడియాకు వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇటీవల ‘ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ టు నైట్‌‌’ అనే హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆస్కార్ ఈవెంట్‌‌లో మేము రెడ్‌‌ కార్పెట్‌‌పై నడిచేది ‘ఆర్ఆర్ఆర్’ యాక్టర్‌‌‌‌గా కాదు.. ఇండియన్‌‌ సినిమా నటుడిగానూ కాదు.. ఒక ఇండియన్‌‌గా నడుస్తాను. మా హృదయంలో భారతదేశాన్ని మోయబోతున్నాం. అందుకు గర్వంగా ఫీలవుతున్నాం’ అని ఎమోషనల్‌‌గా చెప్పాడు. ఇక ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌‌ చేస్తామని కచ్చితంగా చెప్పలేమని, ఎందుకంటే తమకు రిహార్సల్స్ చేసే టైమ్ లేదని చెప్పాడు. షూటింగ్ టైమ్‌‌లో ‘నాటు నాటు’ పాట కోసం డైలీ మూడు గంటలు ప్రాక్టీస్ చేశామని, డ్యాన్స్ కంటే ఇద్దరి మధ్య సింక్ కోసమే ఎక్కువ కష్టపడ్డట్టు చెప్పాడు తారక్.