నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు

V6 Velugu Posted on Nov 08, 2020

ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 ఏళ్ల అన్వయ్ నాయక్ అనే ఇంటీరియర్ డిజైనర్‌‌ను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారన్న కేసులో అర్నాబ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌‌గఢ్‌‌‌ జిల్లా, అలీబాగ్ ప్రైమరీ స్కూల్‌‌లో ఉంచిన అర్నాబ్‌‌ను.. తాజాగా నవీ ముంబైలోని తలోజా జైలుకు పోలీసులు తరలించారు. ఈ సమయంలో మీడియాతో అర్నాబ్ మాట్లాడారు. పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని అర్నాబ్ అన్నారు.

‘నా లాయర్లతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరాను. కానీ అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. నా పోలీసు కస్టడీని తిరస్కరించారు. వాళ్లు నన్ను రాత్రి పూట తరలించాలని యత్నించారు. ఇవ్వాళ పొద్దున నన్ను లాక్కెళ్లారు. నాతో ఎలా ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తున్నారు. వాళ్లు నన్ను ఎక్కువ కాలం జైళ్లో ఉంచాలని చూస్తున్నారు. దయచేసి నాకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును కోరుతున్నా’ అని అర్నాబ్ పేర్కొన్నారు.

Tagged shifted, bail, Mumbai Police, police custody, Arnab Goswami Arrest, torcher

Latest Videos

Subscribe Now

More News