యుద్ధ లక్ష్యాల కోసం ఎంతవరకైనా వెళ్తం: అమెరికా రక్షణ మంత్రి

యుద్ధ లక్ష్యాల కోసం ఎంతవరకైనా వెళ్తం: అమెరికా రక్షణ మంత్రి

వాషింగ్టన్: ఇరాన్‌‌లో ప్రస్తుతం తమ భద్రతా దళాలు ఏవీ లేవని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌‌సెత్ స్పష్టం చేశారు. అయితే, యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైతే ఎంతవరకైనా వెళ్తమని చెప్పారు.  సోమవారం ఆయన ఎయిర్‌‌ ఫోర్స్‌‌ జనరల్‌‌ డాన్ కైన్‌‌తో కలిసి పెంటగాన్‌‌లో ప్రెస్‌‌ కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హెగ్‌‌సెత్ మాట్లాడుతూ.."ఇరాన్‌‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య ‘ఎపిక్ ఫ్యూరీ’ రాత్రికి రాత్రే ముగిసేది కాదు. 

మా సెంటకామ్ దళాలు, జాయింట్ ఫోర్స్‌‌కు అప్పగించిన లక్ష్యాలను సాధించడానికి కొంత టైం పడుతుంది. అమెరికా సైనికులు మరింత మంది ఈ యుద్ధంలో చనిపోయే అవకాశముంది. అయితే,  ప్రాణనష్టాన్ని తగ్గించడానికి  కృషి చేస్తాం.యుద్ధం సుమారు నాలుగు వారాల పాటు కొనసాగవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

మళ్లీ మేం దానిపై ఎలాంటి కామెంట్స్ చేయలేం. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై మాట్లాడే పూర్తి స్వేచ్ఛ అధ్యక్షుడికే ఉంది" అని పేర్కొన్నారు.