
వయస్సు మీద పడుతున్న కొద్దీ కొన్ని కొన్ని జబ్బులు మన ఆరోగ్యాన్ని కూడా హరించేస్తుంటాయి. ఎంత మంచి ఆహారం తీసుకున్న కూడా కొన్ని మన శరీరంలోనే ప్రమాదాన్ని పెంచుతుంటాయి. అయితే ఇప్పడూ అలంటిది ఒకటి పెద్దలనే కాదు పిల్లలను కూడా వెంటాడుతుంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, భారతదేశంలో 5 నుండి 9 ఏళ్ల వయస్సు పిల్లల్లో దాదాపు మూడో వంతు (30%) మందికి రక్తంలో ట్రైగ్లిజరైడ్లు (ఒక రకమైన కొవ్వు) ఎక్కువగా ఉంది. ఈ కొవ్వు ఎక్కువగా ఉంటే వాళ్ళు పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ ఇంకా ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో 67 శాతం పైగా, సిక్కింలో 64 శాతం, నాగాలాండ్‌లో 55 శాతం, అస్సాంలో 57 శాతం, జమ్మూ కాశ్మీర్‌లో 50 శాతం మంది పిల్లల్లో అధిక స్థాయిలో ట్రైగ్లిజరైడ్‌లు ఉన్నట్లు అంచనా. ట్రైగ్లిజరైడ్‌లు అనేది ఒక రకమైన రక్త కొవ్వు, ఇది భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని తెలిసింది.
అతితక్కువగా కేరళలో 16.6 శాతం, మహారాష్ట్రలో 19.1 శాతంగా ఉంది. 2008లో 'Children in India 2025' ప్రారంభమైనప్పటి నుండి ఈ వివరాలు అందులో ఉన్నాయి. ఈ సమాచారాన్ని సెప్టెంబర్ 25న చండీగఢ్‌లో జరిగిన కేంద్ర & రాష్ట్ర గణాంక సంస్థల (CoCSSO) 29వ సమావేశంలో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఈ రిపోర్ట్ దేశంలో పిల్లల పరిస్థితి గురించి వివరాలను అందిస్తుంది అని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ఇంకా సమగ్ర జాతీయ పోషకాహార సర్వే 2016-18 వంటి ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు & విభాగాల నుండి ఈ డేటాను సేకరించారు.
పుట్టిన మొదటి 29 రోజుల్లో శిశువులు చనిపోవడానికి ప్రధాన కారణాలు 48 శాతం తక్కువ బరువుతో పుట్టడం లేదా నెలలు నిండకముందే పుట్టడం, 16 శాతం పుట్టినప్పుడు సరిగా ఊపిరి అందకపోవడం లేదా గాయం కావడం... న్యుమోనియా (9 శాతం).
దేశంలోని ఐదు శాతం మంది టీనేజర్లకు అధిక రక్తపోటు ఉంది. ఢిల్లీలో అత్యధికంగా 10 శాతం మందికి ఉంది. శిశు మరణాలు చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 10 శాతం, తరువాత ఉత్తరప్రదేశ్ (8.6 శాతం), మణిపూర్ (8.3 శాతం), ఛత్తీస్‌గఢ్ (ఏడు శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలోని 16 శాతం మంది టీనేజర్లకు అధిక ట్రైగ్లిజరైడ్లు ఉన్నట్లు అంచనా.