ఈ సంగతి మీకు తెలుసా.. ఆటలకే కాదు.. ఏడ్వడానికి కూడా క్లబ్‌లుంటాయి..!

 ఈ సంగతి మీకు తెలుసా.. ఆటలకే కాదు.. ఏడ్వడానికి కూడా క్లబ్‌లుంటాయి..!

'కొంచెం నవ్వితే ఏం పోతది! ఎప్పుడూ అట్ల ఏడుపు మొఖం పెట్టుకొని కూసుంటవు' అని
చాలా మామూలుగా అనుకుంటరు కదా! ఎవరన్నా ఏడుపు మొఖం పెట్టినరంటే అంతే, వాళ్లను ఇష్టపడేటోళ్లకు నవ్విచ్చేదాక మనసొప్పదు. ఏడుపు దరిద్రం అంటరు. అరిష్టం అంటరు.

ఏడుపు ముఖాన్ని తిట్టుగా వాడుతరు.మరి, ఏడ్వాలనిపిస్తే ఏడ్వక ఏం చేస్తరు? ఒప్పుకోరాయె. 'ఇజ్జత్ పోతది ఏడిస్తే!" అని ఏడ్వనియ్యరు.ఈ ఏడుపు, బాధ, కష్టం.. ఎన్ని రోజులైనా కడుపులనే ఉంటది. అట్ల ఏడుపును బయటికి రానీయకుండనే ఉంచితే, మంచిది కాదు.అందుకే, 'క్రైయింగ్ క్లబ్' అనే గ్రూపు మంచిగ ఏడ్వమని చెప్తున్నది.ఏడిస్తే ఏమొస్తదో కూడా చెప్తున్నది.

అప్పుడప్పుడు ఇట్ల.. ఏడిస్తే ఏం పోతది!' అనుకుంటే కూడా మంచిదే!ఉద్వేగానికి లోనైనప్పుడు వచ్చే కన్నీళ్ల వల్ల ఒత్తిడి, ఆందోళన చాలావరకు తగ్గుతాయి.వందమందిలో 88 మందికి ఏడ్చిన తర్వాత మనసు కుదుటపుడుతుందని పరిశోధనలో తేలింది.

"ఎక్కిల్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల?". 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో 'మరీ అంతగా...' అనే పాటలో వచ్చే గొప్ప లైన్ ఇది. ఈ సినిమా కథ మనుమల్ని ప్రేమిస్తూ, జీవితంలో ఎదురైన ప్రతి ఒక్కరిని ఇష్టంగా నవ్వుతూ పలకరిస్తే చాలు అని చెప్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, మామూలుగానే 'నవ్వితే హాయిగా ఉండొచ్చు' అనే చెబుతారు ఎవ్వరైనా. అది కచ్చితంగా నిజమే.

నవ్వు మనిషిని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. నవ్వితే పక్కనున్న వాళ్లకు కూడా పాజిటివ్ వైట్స్ ఇచ్చినవాళ్లం అవుతాం. కాకపోతే జీవితంలో అందరికీ ఒక దశలో తెలియని బాధ వెంటాడొచ్చు. పని ఒత్తిడి పెరగొచ్చు. అనుకున్న పని చెయ్యలేకపోతున్నామనే ఆలోచన భయపెట్టొచ్చు. అలాంటప్పుడు ఆ బాధను అలాగే కడుపులో దాచుకోకుండా, కొంచెం ఏడిస్తే మనసు కుదుటపడుతుంది. అన్ని సందర్భాల్లో కాదుకానీ, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను తల్చుకొని గట్టిగా ఏడవాలి. అందుకోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా క్లైయింగ్ క్లబ్బులు కూడా వెలుస్తున్నాయి.

►ALSO READ | April Fool's Day 2026: ఈ సంగతి తెలియకుండానే.. ఏప్రిల్ 1న ఎదుటి వాళ్లను ఫూల్స్ చేస్తున్నారా..?

బాధలో ఉన్నప్పుడు అది చెప్పుకోవడానికి ఒకరు తోడుండాలంటారు. తోడున్న మనిషి, అప్పటికప్పుడు ఏదో పరిష్కారం చూపిస్తారనో. ఇంకొకటో కాదు. వాళ్ల ముందు బాధనంతా చెప్పుకొని ఏడ్వడానికి అలా ఏడ్చినప్పుడు భయం.. బాధ కలిసి గుండెలో మొదలయ్యే గుబులు పోతుంది. ఆ గుబులు పోతే మనసు కొంచెం తేలిక పడుతుంది.

కైయింగ్ క్లబ్బులు చేసే పని ఇదే.  ఏడుపు తెప్పించే సినిమాలు చూపించో, సంగీతం వినిపించో ఏడ్వమని చెప్తారు. లేదా మీ జీవితంలో జరిగిన విషయాలను మీకు దూరమైన వ్యక్తులను తలుచుకొని ఏడ్వమంటారు. తెలిసినవాళ్లివ్వరికీ చెప్పుకోలేని బాధ ఉంటే ఇలాంటి క్లబ్బుల్లో చెప్పుకోవచ్చు. నిజానికి ఈ క్లబ్బుల కంటే ముందు, చుట్టూ స్నేహితులు ఉంటారు కదా, వాళ్లతోనే బాధ చెప్పుకోవచ్చు. వాళ్ల ముందే ఏడవొచ్చు. ఆ తర్వాత హ్యాపీగా లైఫ్ ముందుకు వెళ్లిపోవడమే!

ఆ ఏడుపు కాదిది!

జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఎదురుదెబ్బలతో డిప్రెషన్ లోకి కూరుకుపోయేవాళ్లుంటారు. వాళ్లను చాలాసార్లు ఏడుపు అంటిపెట్టుకొనే ఉంటుంది. ఇంకొందరికి సామాజిక సమస్య లైన పేదరికం, ఆకలి, వివక్ష ఏడుపు తెప్పించొ చ్చు ఇలాంటి బాధ, ఏడుపు ఎవ్వరికీ దక్కొద్దనే కోరుకుంటాం.

డిప్రెషన్లో ఉన్నప్పుడు వచ్చే ఏడుపుతో కొన్నిసార్లు ప్రమాదం ఉంది. అది కొద్దిరోజుల పాటు అలాగే కొనసాగి అం తకంతకూ పెరగొచ్చు కూడా.  ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏడ్చి మనసు కుదుటపడాలని చెప్పుకుంటున్న ఏడుపు.. మన కడుపులో దాచిపెట్టుకున్న బాధను బయట పెట్టమని ఇది ఒత్తిడి వల్ల రావొచ్చు. చిన్న చిన్న సమస్యల వల్ల రావొచ్చు. ఇలాంటి బాధను దూరంగా పంపించాలంటే ఏడ్వక తప్పుదు.

–వెలుగు, లైఫ్​–