
ప్రభుత్వాలే కాదు.. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి దివ్యాంగులను ఆదుకోవాలన్నారు కేంద్రమంతి కిషన్ రెడ్డి. గుడిమల్కాపూర్ ఎస్బిఐ కమ్యూనిటీ హాల్ లో దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో త్వరలో క్యాంపులను నిర్వహించి దివ్యాంగులకు కావలసిన వివిధ పరికరాలు అందజేస్తామని తెలిపారు. దీనికి ఎంత ఖర్చైనా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. దివ్యాంగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా 4శాతానికి కేంద్రం పెంచిందన్నారు.