గాయం నుంచి కోలుకున్న హిట్ మ్యాన్

గాయం నుంచి కోలుకున్న హిట్ మ్యాన్

టీమిండియా క్రికెటర్..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న రోహిత్ శర్మ ప్రస్తుతం పిట్ గా ఉన్నట్లు సమాచారం. తొడ కండరాల నొప్పి తగ్గడంతో.. టెస్టు క్రికెట్ కోసం రెడీ అవుతున్నాడట. గాయం నయమైనా..బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ, ఫిట్ నెస్ స్టాండర్డ్స్ కోసం కష్టపడుతున్నాడట. 2020లో పలుసార్లు గాయాలపాలైన హిట్ మ్యాన్ 2021లో నాన్ స్టాప్ క్రికెట్ ఆడేలా రెడీ అవుతున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆస్ట్రేలియా వన్డేలో రోహిత్ శర్మలేని లోటు కనిపించిందంటున్నారు నెటిజన్లు.