హెల్మెట్ పెట్టుకొని.. హుక్ పెట్టుకోకున్నా ఫైన్

హెల్మెట్ పెట్టుకొని.. హుక్ పెట్టుకోకున్నా ఫైన్

హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ప్రతి ఏటా వందల ప్రాణాలు పోతున్నాయి. దాంతో రాష్ట్రంలో హెల్మెట్ తప్పనిసరి చేశారు. అయితే చాలామంది చాలా మోడల్స్‌లో ఉన్న హెల్మెట్లను వాడుతున్నారు. కొంతమంది ఫుల్ హెల్మెట్లు వాడుతుండగా.. మరికొంత మంది హాఫ్ హెల్మెట్లను వాడుతున్నారు. అయితే వీరిలో చాలామంది హెల్మెట్‌ను పెట్టుకుంటున్నారు కానీ.. దాని హుక్ మాత్రం పెట్టుకోవడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం మీది నుంచి కిందపడ్డప్పుడు హెల్మెట్ తల నుంచి ఊడిపోతుంది. దాంతో తలకు తీవ్ర గాయాలై చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సరికొత్త రూల్‌ను తీసుకొచ్చారు. హెల్మెట్ పెట్టుకొని.. హుక్ పెట్టుకోకపోతే కూడా ఫైన్ విధిస్తున్నారు. మోటర్‌ వెహికిల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ ఏడాదిలో హెల్మెట్ పెట్టుకొని.. హుక్ పెట్టుకోని 63 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.135లు జరిమానా విధించారు. వాహనదారులలో అవగాహన కల్పించి ఇలాంటి ప్రమాదాలు పెరగకుండా చూస్తామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ అంటున్నారు. హెల్మెట్ పెట్టుకొని.. హుక్ పెట్టుకోకపోవడంతో ప్రతి ఏటా 80 నుంచి 100 మంది చనిపోతున్నారని ఆయన తెలిపారు.

For More News..

మరో నెలలో పెళ్లనగా తల్లీకూతుళ్లు ఆత్మహత్య