గ్రేటర్ లో నిరుపయోగంగా పబ్లిక్ టాయిలెట్స్..

గ్రేటర్ లో నిరుపయోగంగా పబ్లిక్ టాయిలెట్స్..

గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు ఎందుకు పనికి రావడం లేదు. పేరుకే టాయిలెట్లు ఉన్నాయి కానీ.. వాటిని యూజ్ చేసిన వారు లేరు. మెయింటెనెన్స్  లేకపోవడంతో.. టాయిలెట్స్ గబ్బు కొడుతున్నాయి. చాలా చోట్ల ఫుట్ పాత్ లపై టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వాటి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తేనే దుర్వాసన వస్తోంది. అలాంటిది టాయిలెట్స్ ను యూజ్ చేసే పరిస్థితి లేదు. సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లు ఉంది పరిస్థితి. బల్ధియాలో ఉన్న ఆరు జోన్లలో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. టాయిలెట్స్ మెయింటెనెన్స్ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు. కానీ వర్క్ ఆర్డర్లు ఇవ్వలేదు. బిల్స్ క్లియర్ చేయకపోవడంతో కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన టాయిలెట్స్ వృథాగా ఉండిపోతున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు కొత్తగా 3వేల టాయిలెట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో సగం కూడా సరిగా మెయింటెన్ చేయడం లేదు. చార్మినార్ జోన్ లో 3వందలు, ఎల్బీనగర్ జోన్ లో 428, కూకట్ పల్లి జోన్ లో 398, ఖైరతాబాద్ జోన్ లో 271, శేరిలింగంపల్లి జోన్ లో 521, సికింద్రాబాద్ జోన్ లో 235 టాయిలెట్లు ఎన్నికల కంటే ముందు ఏర్పాటు చేశారు. ప్రతి జోన్ లో కమర్షియల్ టాయిలెట్స్ 80 నుంచి  90 ఉన్నాయి. ఈ కమర్షియల్ టాయిలెట్స్ అయితే అడ్వర్టైజ్ మెంట్ల కోసమే ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. కమర్షియల్ టాయిలెట్స్ చుట్టూ యాడ్స్ ఫ్లెక్సీలే కనిపిస్తాయి. అసలు అక్కడ టాయిలెట్ ఉందా లేదా అన్నది కూడా కనిపించదు. అంతలా యాడ్స్ తో నింపేస్తున్నారు.   కేవలం GHMC ఎన్నికల్లో ప్రచారం ఆర్బాటం కోసమే టాయిలెట్లు నిర్మించారేమోనంటూ పబ్లిక్ విమర్శిస్తున్నారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అవి జానానికి ఉపయోగపనప్పుడు ఎందుకంటూ మండిపడుతున్నారు.