కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లే : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లే : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు
  • చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు
  • ప్రజాస్వామ్యంలో వాస్తవాల ఆధారంగా విమర్శలుండాలి
  • రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆర్థిక సర్వే తేల్చింది
  • రాష్ట్ర ద్రవ్యోల్బణం జాతీయ సగటు కన్నా తక్కువని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  ప్రజాస్వామ్యంలో విమర్శలనేవి ఆరోగ్యకరమైన సంప్రదాయమని, అయితే, అవి వాస్తవాలను ఆధారంగా చేసుకుని ఉండాలే తప్ప రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలుగా ఉండకూడదని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పేర్కొన్నారు. సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే కొందరు కుట్రపూరితమైన అసత్య ప్రచారాలకు తెరలేపారని మండిపడ్డారు.  రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని విమర్శించడం దారుణమని అన్నారు. 

ప్రతి రంగంలోనూ తెలంగాణ సత్తా చాటుతున్నదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. శనివారం   సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు మీడియాతో మాట్లాడారు. కానీ, స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసేలా ప్రభుత్వ పనితీరు, చిత్తశుద్ధిపై కొందరు గోబెల్స్​ ప్రచారం చేస్తున్నారన్నారు.  ఎవరిపైనా కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని చెప్పారు.  

ద్రవ్యోల్బణంలో తెలంగాణ మేలు

రాష్ట్రంలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు చెప్పారు. తెలంగాణ కేంద్రం ఇచ్చే నిధుల మీదనో.. అప్పుల మీదనో ఆధారపడడం లేదని, సొంత పన్నుల నుంచి వచ్చే ఆదాయంపైనే ఎంత బలంగా ఉన్నామో ఆర్థిక సర్వే తేల్చిందని పేర్కొన్నారు. రాష్ట్రం వృద్ధి సాధిస్తుంటే.. వెనుకబడిందంటూ దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘‘ఐటీ, ఇన్నోవేషన్, ఏఐ  రంగాల్లో తెలంగాణ ముద్రను చూసి ప్రపంచమే అబ్బురపడుతున్నది. 

కేవలం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకే పరిమితం కాకుండా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ ఎదిగిందని కేంద్ర ఆర్థిక సర్వే తేల్చింది.  ఐటీ, సేవల రంగంలో తెలంగాణ తన సత్తాను మరోసారి చాటుకుంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న సేవల రంగంలో కేవలం 4 రాష్ట్రాలు 40 శాతం వాటాను కలిగి ఉంటే.. అందులో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులాంటి రాష్ట్రాల సరసన తెలంగాణ సగర్వంగా నిలబడింది. 

రేపటి ప్రపంచాన్ని శాసించబోయే జెన్​-ఏఐ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో దేశవ్యాప్తంగా 7 శాతం వాటాతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరు, ఢిల్లీలతో పోటీపడుతూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందని ఈ సర్వే మరోసారి స్పష్టం చేసింది’’ అని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అంటే తమ ప్రభుత్వ దృష్టిలో కేవలం అంకెలే కాదని, ఆడబిడ్డల భద్రత, యువతకు ఉపాధి అని శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు చెప్పారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నదని తెలిపారు.