జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నోటా

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నోటా

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తం 58 మంది పోటీ చేశారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తర్వాత నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 55 మంది అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 1,94,732 ఓట్లు పోల్ కాగా, ఇందులో 924 ఓట్లు నోటాకు వచ్చాయి. ప్రధాన మూడు పార్టీల అభ్యర్థుల తర్వాత నాలుగో స్థానంలో నోటానే ఉంది. మొత్తం అభ్యర్థుల్లో 29 మంది వివిధ పార్టీల నుంచి పోటీలో ఉండగా, మరో 29 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 98,988 ఓట్లు రాగా, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు 74,259 ఓట్లు, బీజేపీకి 17,061 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత నోటా ఉంది. నోటా తర్వాత అలియన్స్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థికి 231 ఓట్లు వచ్చాయి. మిగతా 54 మంది అభ్యర్థుల్లో 12 మందికి 200లోపు ఓట్లు వచ్చాయి. 41 మందికి డబుల్ డిజిట్‌‌‌‌‌‌‌‌ ఓట్లు రాగా, ఒక అభ్యర్థికి మాత్రం 9 ఓట్లతో సింగిల్ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితం అయ్యారు.