హైదరాబాద్, వెలుగు: ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫైల్ చేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం డిస్మిస్ చేసింది. సండ్ర ఫైల్ చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను ఏసీబీ కోర్టు నవంబర్ 2న కొట్టేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఓటుకు నోటు కేసుతో సండ్రకు ప్రత్యక్ష ప్రమేయం లేదని ఆయన తరఫు లాయర్ వాదించారు. ఎఫ్‌ఐఆర్‌లో కూడా సండ్ర పేరు లేదన్నారు. కావాలనే ఆయనను కేసులో ఇరికించారని ఆరోపించారు. సండ్రకు సంబంధం ఉన్నట్లుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు ఉన్నాయని ఏసీబీ తరఫు లాయర్ వాదించారు. సండ్ర ఫోన్ కాల్స్ డేటా, మెసేజ్‌లు ఉన్నాయని చెప్పారు.
