
లక్నో: లక్నో సూపర్‌జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీపై బీసీసీఐ ఓ మ్యాచ్ నిషేధం విధించింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ను ఔట్ చేసిన తర్వాత దిగ్వేశ్ మళ్లీ ‘నోట్ బుక్ టిక్’ సంబురాలతో రెచ్చిపోయాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.
దిగ్వేశ్ మూడోసారి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో ఓ మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు 50 శాతం ఫీజు కోత విధించారు. అలాగే మరో రెండు డీ మెరిట్ పాయింట్లను కూడా వేశారు. ఓవరాల్‌గా దిగ్వేశ్ ఖాతాలో ఐదు డి మెరిట్ పాయింట్లు ఉన్నాయి. ఈ నిషేధంతో 22న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కు దిగ్వేశ్ అందుబాటులో ఉండడు.
ఇక అభిషేక్ మ్యాచ్ ఫీజులోనూ 25 శాతం కోత విధించిన ఐపీఎల్ పాలక మండలి ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. గతంలో పంజాబ్, ముంబైతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ వికెట్లు తీసిన తర్వాత దిగ్వేశ్ నోట్ బుక్ టిక్ సంబురాలతో హద్దులు మీరి ప్రవర్తించిన సంగతి తెలిసిందే.