వాస్తు నిపుణుడు ఖుష్దీప్ బన్సాల్ అరెస్ట్

 వాస్తు నిపుణుడు ఖుష్దీప్ బన్సాల్ అరెస్ట్

ప్రముఖ వాస్తు నిపుణుడు ఖుష్దీప్ బన్సాల్ అరెస్ట్ అయ్యారు.  రూ. 65 కోట్ల భారీ మోసానికి సంబంధించి ఖుష్దీప్ తో పాటుగా ఆయన  సోదరుడిని కూడా  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఢిల్లీకి చెందిన వ్యాపారి కమల్ సబర్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు  వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.  ఈ కేసులో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.  కాగా 1997లో పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో వాస్తు లోపాలు ఉన్నాయని అందుకే అప్పటి ప్రభుత్వం కూలిపోయిందని చెప్పి వార్తల్లో నిలిచారు.