
జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. పోతుంటాయి. వాటిని చూసి బాధపడి.. పిరికివాడిలా ప్రవర్తించవద్దు" అని కృష్ణుడు మందలిస్తాడు. ఒక మనిషిగా మన బాధ్యతను మనం.... నూటికి నూరుపాళ్లు నిర్వర్తించాలి. కర్మను నిర్వర్తించడమే మన చేతిలో ఉంటుంది. దాని ఫలితాలు మన చేతిలో ఉండవని శ్రీకృష్ణుడు భగవద్గీతలోచెప్పాడు.
ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి తాత్కాలికమే! దీన్ని పరిశీలించి చూసినా ప్రతీది ప్రపంచంలోకి వస్తుంది. కొంతకాలం ఉంటుంది. దాని బై ప్రొడక్ట్ ని సృష్టించి నెమ్మదిగా క్షీణిస్తుంది. తర్వాత కనపడకుండా మాయమైపోతుందని అర్థమవుతుంది. శరీరం, పండు ఇలా దేనికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఓటమి, కోపం, బాధ, భయం ఏదీ శాశ్వతం కాదు. ఇదే సృష్టి నియమం కానీ, శాశ్వతం అన్న భ్రమతోనే కోరికల వెంట పరుగులు తీస్తుంటాం. బాధలు తెచ్చి పెట్టుకుంటాం!!
తాత్కాలిక విషయాల గురించి పడే పదే ఆలోచించుకుంటూ మనిషి ఒత్తిడికి గురవుతుంటాడు. కరోనా లాంటి క్రైసిస్ కూడా తాత్కాలికమే... కరోనాపై యుద్ధం చేసే క్రమంలో చాలామంది అర్జునుడిలాగే ఉద్యోగం, ఆస్తి, ఆప్తులు... ఇలా ఏదోఒకటి కోల్పోతామేమో అనే భయంతో బాధ పడ్డారు . కానీ, ఇప్పుడు మనల్ని ఓసారి అర్జునుడి స్థానంలో ఊహించుకుంటే.." జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. పోతుంటాయి. వాటిని చూసి బాధపడి. పిరికివాడిలా ప్రవర్తించవద్దు"అని కృష్ణుడు మందలిస్తారు.
ఒక మనిషిగా మన బాధ్యతను మనం... నూటికి నూరుపాళ్లు నిర్వర్తించాలి. బాధ్యతను పాటిస్తా సరే.... దానికి తగ్గ ఫలితం రాకపోతే... అనే బాధ సహజంగానే కలుగుతుంది. కర్మను సక్రమంగా నిర్వర్తించడమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం మన చేతుల్లో ఉందదు అంటాడు నందనుడు.
ఒక్కోసారి ఫలితం వెంటనే రావొచ్చు..ఆలస్యంగానూ రావొచ్చు మనం చేయాల్సింది చిత్తశుద్దితో చేసుకుంటూ పోతే.. చివరికి విజయం దక్కి తీరుతుంది. బాధల్లో ఉన్నప్పుడు.. బాధపడినంతసేపు బాధపడి చివరికి నిరాశతో కోపం, ద్వేషం తెచ్చుకుంటాం. కోపం, ద్వేషం, వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేం అని గీతరెండో చాప్టర్లో కృష్ణుడు అంటాడు. ఏటైమ్ లోనైనా.. ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించాలి.
భగవద్గీత చదువుతున్నప్పుడు శరీరం శాశ్వతం కాదు, అత్మ ఒక్కటే శాశ్వతం అన్న మాట చాలాసార్లు వినిపిస్తుంది. దీని నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి ఆస్తి, అంతస్తు, హోదా లాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదు. రెండు ఎలాంటి మార్పునైనా ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్దంగా ఉండాలి. మరి అన్ని తాత్కాలికమే కదా? ఇంకేం చేయాలి? ఎందుకు చేయాలి? అనే సందేహం కలుగుతుంది.
ఏ ఫిలాసఫీ చూసినా.... అన్నీ జ్ఞానానికే పెద్ద పీట వేశాయి. ఈ జ్ఞానం మనకు మనం పెంచుకునేదే కావొచ్చు. ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువు, పరిశీలన ఏదైనా సరే, గురువు నుంచి వీలైనంత జ్ఞానాన్ని పొందాలని గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ ప్రయాణం ఆత్మజ్ఞానం వరకు సాగాలి. ఆత్మజ్ఞానం వల్లే శాశ్వతత్వాన్ని పొందుతాం!
ఎటాచ్ మెంట్ విత్ డిటాచ్ మెంట్
ఎటాచ్ మెంట్ విత్ డిటాన్ మెంట్... అనే సూత్రం భగవద్గీతలో క్లియర్ గా కనిపిస్తుంది. నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి. కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు.మన ఆలోచనలే... మన జీవితం. గతాన్ని తలుచుకోకుండా, భవిష్యత్తు గురించి కలలు కనకుండా.. వర్తమానంపై మనసు పెట్టాలి. అన్న బుద్ధుడి మాటల్ని పాటిస్తే చాలు బాధలు మాయమవుతాయి