
బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. దసరా పండగ ముందు బంగారం కొనుగోలు చేసే వాళ్లను ప్రస్తుత ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న లక్షా 6 వేల 860 ఉన్న బంగారం ధర.. ఇవాళ ఒక్క రోజే రూ. 790 పెరిగింది. దీంతో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ కు చేరింది. అటు సిల్వర్ కేజీ ధర రూ. లక్షా 37 వేలు ఉండగా.. వెయ్యి రూపాయలు తగ్గి రూ. లక్షా 36 వేలకు చేరింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 760 పెరిగి రూ. లక్షా 7 వేల 620కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 700 పెరగడంతో రూ. 98 వేల 650కి చేరింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 580 పెరిగి రూ. 80 వేల 720కి చేరింది.
బంగారం ధరలు గత పది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. ఆగస్టు 27 న లక్షా 2 వేలు ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 5 నాటికి అంటే ఈ పది రోజుల్లోనే దాదాపు ఐదు వేలకు పైగా పెరిగింది. (నిన్న) ఒక్క రోజు తప్ప మిగతా రోజులు భారీగా పెరిగింది.