గ్రహణం రోజు ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆలయం ఇదే..!

గ్రహణం రోజు ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆలయం ఇదే..!


గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసేస్తారు. కాని కొన్ని ప్రత్యేక నమ్మకాల కారణంగా.. కొన్ని ఆలయాలు సూతక కాలంలో తెరిచి ఉంటాయి.  ఆంధ్రప్రదేశ్​లోని   శ్రీకాళహస్తి  దేవాలయంలో గ్రహణ కాలంలో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించనున్నారు.  ఆ సమయంలో భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తారు. 

పురాణాల ప్రకారం.. శ్రీకాళహస్తిలోని పరమేశ్వరుడు.. . సూర్య.. చంద్రులు .. అగ్నిభట్టారడితో పాటు నవగ్రహాలు.. 27 నక్షత్రాలతో వాయులింగేశ్వరుడు కవచాన్ని ఏర్పాటు చేసుకుని భక్తులకు దర్శనమిస్తాడు.  అందువలన ఈ క్షేత్రానికి రాహువు.. కేతువుల వలన ఎలాంటి నష్టము ఉండదు.  సాధారణంగా గ్రహణాల సమయంలో రాహువు.. కేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటాయి.  సెప్టెంబర్​ 7 న రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది.  

భారతీయ సంస్కృతిలో గ్రహణాలకు  ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణ సమయంలో మనుషులే కాదు పశుపక్షాదులు కూడా కదలవని పండితులు చెబుతుంటారు.  దేశ వ్యాప్తంగా  ప్రముఖ దేవాలయాలతో సహా   అనేక ఆలయాలను మూసివేస్తారు.

దేశంలో  కొన్ని దేవాలయాలు తెరచి ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహణ సమయంలో తెరచి ఉండి.. విశేష పూజలను జరుపుకునే ఆలయం ఏపిలో ఒక దేవాలయానికి మాత్రమే మినహాయింపు ఉంది. గ్రహణం రోజున ఆలయం తెరిచే ఉంటుంది.  

తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దేవాలయం. ఈ దేవాలయం  చంద్ర గ్రహణమైనా, సూర్య గ్రహణం అయినా గ్రహణకాలంలోనూ తెరచే ఉంచుతారు. 
శ్రీజ్ఞాన ప్రసునాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయమని పూజారులు చెబుతున్నారు. 

శ్రీకాళహస్తీశ్వర స్వామిలో...  శ్రీ అంటే సాలె పురుగు... కాళం అంటే పాము... హస్తి అంటే ఏనుగు... ఈ మూడు జంతువులు ఇక్కడ పూజలు చేసి శివునిలో ఐక్యం అయ్యాయి. ఇక్కడ శివుడు పాము రూపంలో ఉంటారు. ఆయన శిరస్సు మీద అయిదు తలల సర్పం ఉంటుంది. అలాగే జ్ఞాన ప్రసూనాంబగా పిలుచుకునే అమ్మవారి నడుముకు నాగాభరణం ఉంటుంది.ఈ దేవాలయంలో రాహు కేతువులు ఉన్నారు. అందువల్ల శ్రీకాళహస్తి దేవాలయం రాహు కేతు క్షేత్రంగా పేరుగాంచింది. 

సూర్యగ్రహణమైనా ...  చంద్రగ్రహణమైనా సూర్యచంద్రులను కబళించేది రాహు కేతువులే.
శ్రీకాళహస్తి ఆలయం రాహు.. -కేతు క్షేత్రం కావడంతో..  గ్రహణాల సమయంలో కూడా తెరచి ... రాహువు.... -కేతువులకు  శాంతి పూజలు నిర్వహిస్తారు. గ్రహణం సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అలాగే భక్తులు కూడా వచ్చి రాహు కేతు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. 

అలాగే స్వామి, అమ్మవారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషమే కాకుండా నక్షత్ర, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ కడతారు. చంద్ర గ్రహణం విడుపు సమయంలో ఈ అభిషేకాన్ని జరుపుతారు. గ్రహణ సమయంలో రాహు, కేతు, సర్ప దోషాల నివారణ కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే.. విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకనే గ్రహణ సమయాల్లో భారీగా భక్తులు ఆలయానికి చేరుకొని వాయులింగేశ్వరుడిని పూజిస్తారు....

ఇంకా ఏఏ దేవాలయాలంటే..

వీటిలో బీహార్‌లోని గయలోని విష్ణుపాద ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండదని నమ్ముతారు. కాబట్టి సూతక కాలంలో ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి. అదేవిధంగా రాజస్థాన్‌లోని బికనీర్‌లోని లక్ష్మీనాథ్ ఆలయం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళ ఆలయం కూడా సూతక కాలంలో తెరిచే ఉంచుతారు.