Oppo F31 Series స్మార్ట్ ఫోన్లు.. బ్యాటరీ కెపాసిటీ ఏంట్రా బాబూ.. కంచమేంటి ఇంతుంది అన్నట్టుందిగా !

Oppo F31 Series స్మార్ట్ ఫోన్లు.. బ్యాటరీ కెపాసిటీ ఏంట్రా బాబూ.. కంచమేంటి ఇంతుంది అన్నట్టుందిగా !

Oppo F31Series స్మార్ట్ ఫోన్ కొత్త మోడల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. సెప్టెంబర్ 12న Oppo F31Series స్మార్ట్ ఫోన్లు ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెక్ వెబ్సైట్స్లో బజ్ గట్టిగా నడుస్తోంది. అంతేకాదు.. ఒప్పో ఎఫ్31 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 20 వేల లోపే ఉండొచ్చని టాక్. అయితే.. ఒప్పో ఎఫ్31 ప్రో, ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ మోడల్స్ ధర మాత్రం 30 వేల నుంచి 35 వేల మధ్యలో ఉండొచ్చని స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ Oppo F31Series స్మార్ట్ ఫోన్లలో హైలైట్ ఫీచర్ ఏంటంటే.. బిగ్ బ్యాటరీ లైఫ్. 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో Oppo F31 ఫోన్లు కస్టమర్లకు మంచి బ్యాటరీ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనున్నాయి.

త్వరలో ఇండియాలో లాంచ్ అవుతున్న OPPO F31 Series ఫీచర్స్ డీటైల్స్:

కలర్స్:
*- OPPO F31: బ్లూ, గ్రీన్, రెడ్
-* OPPO F31 Pro: గోల్డ్, గ్రే
-* OPPO F31 Pro+: బ్లూ, వైట్, పింక్

డిస్ ప్లే, కెమెరా, బ్యాటరీ కెపాసిటీ డీటైల్స్:
-* 7,000mAh బ్యాటరీ
-* IP66, IP68, IP69 రేటింగ్
-* 50 మెగా పిక్సెల్ కెమెరా

ధరలు:
* F31 మోడల్ ధర ఇంచుమించు 20 వేలు
* F31 ప్రో ధర సుమారు 30 వేలు
-* F31 ప్రో ప్లస్ 35 వేల వరకూ ఉండొచ్చు