
చంద్రగ్రహణం ప్రభావం అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ 7న ఏర్పడే చంద్రగ్రహణం శని భగవానుడికి అధినేత కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఎఫెక్ట్ అన్ని రాశుల వారిపై ఉన్నా .. కుంభరాశి.. కర్కాటక రాశి.. మీన రాశులపై అధికంగా ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన ప్రకారం చంద్రగ్రహణ సమయంలో ఏర్పడిన చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి.. చంద్రగ్రహణం తరువాత రోజు అంటే ఈ నెల 8 వతేది ఉదయం.. కొన్ని వస్తువులు దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . .
- మేషరాశి : తెల్ల వస్త్రాలు , చక్కెర
- వృషభ రాశి : పసుపు, కుంకుమ.. గోమాతకు గోధుమలు తినిపించాలి
- మిథున రాశి : ఆకు కూరలు , పండ్లు , బియ్యం
- కర్కాటక రాశి : బియ్యం, పాలు , బెల్లం, మినుములు
- సింహ రాశి : ఎర్ర పుష్పాలు, ఎర్రని పండ్లు, గోధుమలు
- కన్యా రాశి : ఆయుర్వేద ఔషధాలు, పసుపు రంగు పండ్లు , బెల్లం
- తులా రాశి : బిల్వపత్రాలు, ఆవు నెయ్యి, చక్కెర , తెల్ల బట్టలు
- వృశ్చిక రాశి : నల్ల వస్త్రాలు, మినుములు , నెయ్యితో వెలిగించిన దీపం దానం..
- ధనుస్సు రాశి : పసుపు, పుస్తకాలు, గోధుమలు.
- మకర రాశి : నల్ల నువ్వులు దానం చేయండి. పిండితో ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యి తో దీపం వెలిగించి దానం ఇవ్వాలి.. గోమాతకు తోటకూర తినిపించాలి.
- కుంభ రాశి : వెండి నాగేంద్రుని ప్రతిమ.. బియ్యం.. మినుములు.. దానంతో పంచామృతంతో శివుడికి అభిషేకం .. గోమాతకు గోధుమలు.. తోటకూర తినిపించాలి.
- మీన రాశి : పంచలోహ పాత్రలు, పాలు, బియ్యం, మినుములు, బెల్లం
12 రాశుల వారు గ్రహణం తరువాత రోజు శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి.. రాహువును.. చంద్రుడిని పూజించాలి. బ్రాహ్మణులకు.. కాళ్లు కడిగి కేజీం పావు చొప్పున బియ్యం... మినుములు.. దక్షిణ.. తాంబూలం ఇవ్వాలి.