
చంద్ర గ్రహణం సమయంలో చంద్రుడి తీవ్రత అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ 7న ఏర్పడేది చంద్రగహణం రాహుగ్రస్త చంద్రగ్రణమని చెబుతున్నారు. రాహువు చెడు దృష్టి..చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం తగ్గేందుకు గ్రహణ సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారు? దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం.. .
చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు రాహువు ప్రభావం కూడా ఉంటుంది. ఈ సమయంలో ఆహార పదార్ధాలపై చంద్రుని కిరణాణాలు... రాహువు చెడు దృష్టి పడి.. చాలా నష్టం జరుగుతుంది. సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి ఉంచుతారు.
ఖగోళశాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ... చంద్ర గ్రహణ సమయంలో .. చంద్రుడు నుంచి కాస్మొటిక్ రేడియేషన్ వస్తుంది. పురాణాల ప్రకారం దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంటుంది. అంతేకాకుండా గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహణ సమయంలో శరీరంలోని శక్తి నశిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే తినే పదార్ధాలపై దర్భలను ఉంచితే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.
గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా .. అధిక శక్తితో ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో వాటి శక్తిని బలహీన పరిచేందుకు .. వాటి ప్రభావం తగ్గేందుకు.. ఎలాంటి హాని చేయకుండా.. ఆహార పదార్థాలను ముట్టకూడదని పెద్దలు అంటారు. అందుకే దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలు, గృహాలను సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి.
హిందూ మతంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు గ్రహణాలు అశుభకరంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి సంభవించబోతోంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం భారతదేశం సహా అనేక దేశాల్లో కనిపిస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. చంద్రగ్రహణం సూతకం సెప్టెంబర్ 7 వ తేది మధ్యాహ్నం 12.57గంటలకు ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ సూతకాలం చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది. పంచాంగాల ప్రకారం చంద్రగ్రహణ సూతక కాలం ఎల్లప్పుడూ 9 గంటల ముందు ప్రారంభమవుతుంది.
2025 లో ఇదే చివరిదైన చంద్రగ్రహణం. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్ధాలపై దర్భ వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు. దర్భలు చాలా పవిత్రమైనవి. అందుకే వాటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతుంటారు.
గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- గ్రహణానికి ముందుగా దర్భలు ఇంటిపై వేయాలి.
- పచ్చళ్లు, పాలు.. పెరుగు మీద ఉంచాలి. గ్రహణం ముందు వండిన ఆహార పదార్ధాలను పూర్తిగా పడవేయాలి.
- గ్రహణానికి 9 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి.
- గ్రహణం వీడిన తర్వాత స్నానము చెయ్యాలి.
- ఆ సమయంలో మంత్రం జపం.. అనుష్ఠానం వలన అధిక ఫలితం ఉంటుంది