NagaChaitanya: అక్కినేని వారసత్వాన్ని నిలబెడుతున్న చైతన్య.. 16 ఏళ్ల సినీ ప్రయాణంలో.. !

NagaChaitanya: అక్కినేని వారసత్వాన్ని నిలబెడుతున్న చైతన్య.. 16 ఏళ్ల సినీ ప్రయాణంలో.. !

అక్కినేని మనవడిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో నాగ చైతన్య. కింగ్ నాగార్జున వారసుడిగా, వెంకటేష్ మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2009లో జోష్ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి విభిన్న క్యారెక్టర్స్ చేస్తూ కల్ట్ క్లాస్ విత్ మాస్ అభిమానులు సొంతం చేసుకున్నారు చై. ఈ క్రమంలోనే నాగ చైతన్య తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 16 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య సినీ కెరీర్ విషయాలు చూస్తే..  

నాగ చైతన్య తన సినీ కెరియర్లో భిన్నమైన జోనర్స్ ట్రై చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కాలేజ్ స్టూడెంట్, లవర్ బాయ్, మాస్, కామెడీ వంటి రోల్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. తన మొదటి సినిమా జోష్ తోనే ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ మరియ, నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్తో ఏ మాయ చేసావే, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ చేసి భారీ విజయాలు అందుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలతో ఆడియన్స్కి చైతన్య మరింత దగ్గరయ్యాడు.

ఈ క్రమంలోనే నటుడిగా ప్రయోగాలు సైతం చేయాలనీ ప్రయత్నం చేసి ఆకట్టుకున్నాడు. అందులో తడక (2013), ఆటో నగర్ సూర్య (2014), సవ్యసాచి (2018), మరియు శైలజా రెడ్డి అల్లుడు (2018) వంటి సినిమాలు అతనిని మరింత మాస్-ఓరియెంటెడ్ పాత్రలు చేయగలడని నిరూపించాయి. అయితే, మజిలి (2019), లవ్ స్టోరీ (2021), మరియు తండేల్ (2025) వంటి సినిమాలు మాత్రం తనలోని నట సామర్థ్యాన్ని హైలైట్ చేశాయి. అలాగే, చైతులోని భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించాయి. ఈ క్రమంలోనే తండేల్ మూవీతో వచ్చి వందకోట్ల క్లబ్లో చేరి తన సత్తా చాటుకున్నాడు.

ప్రస్తుతం చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్లో ఓ మైథికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు నాగ చైతన్య. తన పాత్ర కోసం ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంప్లీట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ అయ్యాడు. ఇప్పటికే, రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇది నాగచైతన్య కెరియర్లో 24వ మూవీ కావడం విశేషం.