జనగామ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు నోటీసులు

జనగామ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు నోటీసులు

జనగామ, వెలుగు : జనగామ శివారు యశ్వంతాపూర్‌‌‌‌లోని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ జిల్లా ఆఫీస్‌‌‌‌ ఆక్రమణలపై ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఈ నెల 7న ‘వెలుగు’ దినపత్రికలో పబ్లిష్‌‌‌‌ అయిన ‘దర్జాగా కబ్జా’ స్టోరీకి స్పందించిన ఆఫీసర్లు విచారణ జరిపి అర ఎకరం ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించారు. దీంతో కలెక్టర్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ బాషా షేక్​, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ రోహిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ల ఆదేశాలతో జనగామ ఆర్‌‌‌‌ఐ అన్వేష్‌ నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసులను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డి క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో సిబ్బందికి అందజేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో నోటీసులు ఇచ్చినట్లు ఆర్‌‌‌‌ఐ చెప్పారు. నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.