
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌లోని నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్లో మంగళవారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, తుప్పుపట్టిన ఫ్రిడ్జ్‌లో చికెన్, మటన్ స్టోర్చేసినట్లు గుర్తించారు. కిచెన్‌లో ఓపెన్ డ్రైనేజీ ఉండడాన్ని చూసి నిర్వాహకులపై అధికారులు మండిపడ్డారు. నోటీసులు జారీ చేశారు.